Suryaa.co.in

Andhra Pradesh

గిరిజనుల సమస్యల పరిష్కారంలో రోల్ మోడల్ గా సర్వేపల్లి

– అమాయకులైన గిరిజనుల జీవితాల్లో మార్పుతేవడానికి కట్టుబడి ఉన్నాం
– వైసీపీ ఐదేళ్ల పాలనలో ఐటీడీఏను నిర్వీర్యం చేయడంతో పాటు సంక్షేమ పథకాలను నిలిపేశారు
– మళ్లీ ప్రతి పథకం అమలులోకి తేవడంతో పాటు నిధుల కేటాయింపులోనూ గిరిజన కాలనీలపై ప్రత్యేక దృష్టి పెడతాం
– సమస్యల పరిష్కారంలో మొదటి ప్రాధాన్యత గిరిజనులకే
– వెంకటాచలం మండలం చెముడుగుంటలోని శ్రిడ్స్ కళ్యాణ మండపంలో నిర్వహించిన గిరిజనుల ప్రత్యేక ప్రజా విజ్ఞాపనల పరిష్కార వేదిక(గిరిజనుల సదస్సు)లో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
– వైసీపీ పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడ పేరుకుపోవడంతో అర్జీలతో పోటెత్తిన గిరిజనులు

సర్వేపల్లి: నియోజకవర్గంలో దాదాపు 45 వేల మంది గిరిజన బిడ్డలున్నారు.అత్యంత పేదరికంలో ఉన్న గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టాం. ఐదు మండలాల నుంచి భారీ సంఖ్యలో గిరిజనులు తరలివచ్చారు.

నేను వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు గిరిజన బిడ్డల సమస్యలను చాలా దగ్గరగా చూశాను. గిరిజనుల్లో మెజార్టీ శాతం మందికి ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు.ఒక్క పైనాపురం చిన్నసంఘంలోనే 66 కుటుంబాలు ఉంటే 44 కుటుంబాలకు ఆధార్ కార్డులు లేవు..19 మందికి అర్హత ఉండి పింఛన్ రావడం లేదు.

రాష్ట్రంలోని నిరక్షరాస్యుల్లో 90 శాతం మంది గిరిజనులే.గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వైసీపీ ప్రభుత్వంలో వారి భూములను కూడా కొందరు పెత్తందారులు కాజేశారు. అర్హత ఉన్నప్పటికీ అమాయకత్వంతో పాటు దళారుల జోక్యంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారు.

అత్యంత దుర్భర జీవితం గడుపుతున్న గిరిజనుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.గతంలో ఐటీడీఏ పీఓగా పనిచేసిన నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజకు గిరిజనుల సమస్యలు – పరిష్కారంపై సంపూర్ణ అవగాహన ఉంది.

కలెక్టర్ ఆనంద్ తో పాటు జిల్లాలోని అన్ని శాఖల ముఖ్య అధికారులు కూడా ఈ వేదికపై నుంచి గిరిజనుల వినతులు స్వీకరించడం శుభపరిణామం.ప్రతి సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారిని అందుబాటులో ఉంచాం.

గిరిజనుల సమస్యల పరిష్కారాన్ని అత్యంత ప్రాధాన్యమైన అంశంగా తీసుకున్నాం.ఇకపై ఆధార్ లేదు..రేషన్ కార్డు లేదు..పింఛన్ రావడం లేదు, ఇల్లు లేదు అనే మాట రాకుండా ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా మన గిరిజనులకు కూడా ప్రయోజనం కల్పించేలా చర్యలు తీసుకుంటాం.

వైసీపీ ప్రభుత్వం నిలిపేసిన గిరిజనుల పథకాలను తిరిగి మా ప్రభుత్వం అమలు చేస్తుంది.దేశమంతా అమలైన పథకాలను ఒక్క ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఆపేయడం దుర్మార్గం.ఎన్నో అవాంతరాలను అధిగమించి గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరుకు ఐటీడీఏ సాధించాను..ఆ ఐటీడీఏను కూడా నిర్వీర్యం చేసేశారు.

90 శాతం వరకు సబ్సిడీపై పొందే పథకాలను కూడా కక్ష కట్టి ఆపేశారు. చట్టప్రకారం తప్పనిసరిగా అమలుకావాల్సిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను కూడా తొక్కేశారు. ఇకపై అలా ఉండదు..గిరిజనుల జీవితాల్లో వెలుగులు తెస్తాం.వ్యవసాయం, ఉద్యాన పంటలకు సంబంధించిన అన్ని పథకాల్లోనూ గిరిజనులకు లబ్ధి చేకూరుస్తాం.విద్యాపరమైన సౌకర్యాలు కల్పించడంలోనూ ముందుంటాం.

ప్రైవేటు కంపెనీలు, పారిశ్రామిక వేత్తలకు కొన్ని కాలనీలు దత్తత ఇచ్చి గిరిజన బిడ్డల అభ్యున్నతికి కృషి చేస్తాం. నేను కూడా మల్లికార్జునపురంతో పాటు పైనాపురం చిన్నసంఘంను దత్తత తీసుకున్నాను.సీఎస్ఆర్, నుడా తదితర నిధుల కేటాయింపులో గిరిజన కాలనీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తాం.

వైసీపీ ప్రభుత్వంలో గిరిజనులను మోసం చేసి భూములు ఆక్రమించిన ఘటనలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తాం.గిరిజనుల అభ్యున్నతికి మా నాయకుడు, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కంకణం కట్టుకుని పనిచేస్తాం.

LEAVE A RESPONSE