Suryaa.co.in

Andhra Pradesh

100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేసిన ద్వారంపూడి

– చేంజ్ ఆఫ్ ల్యాండ్ పేరుతో మాజీ ఎమ్మెల్యే అక్రమాలు
– శాసనసభ్యులు వనమాడి కొండబాబు

కాకినాడ : చేంజ్ ఆఫ్ ల్యాండ్ పేరుతో సుమారు రూ. వంద కోట్లు విలువ చేసే స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు భూమి దోపిడీకి తెర లేపడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు.

బ్యాంకు పేటలో ఉన్న సత్తి గోపాలకృష్ణారెడ్డికు చెందిన స్థలంలో గృహ నిర్మాణ పేరుతో ఈ స్థలానికి బదులు శ్రీవిద్య కాలనీలో స్థలాన్ని ఇచ్చే విధంగా అక్కడ స్థలాన్ని తీసుకోవడంతో పాటు మున్సిపాలిటీకి అందజేయవలసిన స్థలాన్ని ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు కబ్జా చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు.

శుక్రవారం కాకినాడలో బ్యాంకు పేట, శ్రీవిద్య కాలనీలో ఎమ్మెల్యే కొండబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ.. సుమారు రూ. 100 కోట్లు విలువ చేసే స్థలాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు కాజేసారని, వారంపూడి కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరేలా బ్యాంకుపేటలో ఉన్న సత్తి గోపాలకృష్ణ రెడ్డి పేరు మీద ఉన్న స్థలంలో పేదలకు గృహాలు నిర్మాణం పేరుతో సత్తి గోపాలకృష్ణారెడ్డికి చెందిన రాగంపేట స్థలానికి బదులు శ్రీవిద్య కాలనీలో తలం ఇచ్చే విధంగా జీవో తీసుకువచ్చి విలువైన ప్రభుత్వ భూమిని కాజేసి దోచుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

రాగంపేటలో ఉన్న స్థలంలో గృహాలు నిర్మించకుండా నేటికీ ప్రభుత్వానికి అందచేయకుండా ఆట స్థలాలుగా మార్చి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, చేంజ్ ఆఫ్ ల్యాండ్ పేరుతో కాజేసిన చేసిన శ్రీవిద్య కాలనీ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందగా, రాగంపేట ప్రాంతం మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి, పేద ప్రజలకు ఇళ్ళు కట్టే విధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, బంగారు సూర్యావతి సత్యనారాయణ, పొంగా బుజ్జి, గదుల సాయిబాబా, చింతలపూడి రవి, ఒమ్మి బాలాజీ, ఆమన్ జైన్, రిక్కా లక్ష్మి, కోడూరి పెద్ద, రెడ్డనం సత్తిబాబు, పందిరి బాబీ, అమలకంటి బలరాం, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE