– పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగకూడదు
– ఇదే మా ఫౌండేషన్ ఆశయం..లక్ష్యం
రామచంద్రపురం: రామచంద్రపురంలోని “సత్యం వాసంశెట్టి ఫౌండేషన్” ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం రామచంద్రపురంకు చెందిన ఇద్దరు నిరుపేద ఇంజనీరింగ్ విద్యార్థినిలు గోడి మౌనిక, ఆరంగి మల్లేశ్వరి, సౌమ్య( సిస్టర్స్ )లకు రూ.1.90 లక్షలు విలువచేసే రెండు లాప్టాప్ లను సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం ఉచితంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ సత్యం మాట్లాడుతూ పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగకూడదనే తన కుమారుని మహోన్నత ఆశయం మేరకు ఫౌండేషన్ స్థాపించామని వెల్లడించారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు లాప్టాప్ చాలా అవసరమని, ఆర్థిక స్తోమత లేని నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులకు ఇంజనీరింగ్ ఉన్నత విద్య కోసం ఈ లాప్టాప్ లు అందజేయడం జరిగిందని చెప్పారు.
చదువును మించిన ఆస్తి మరొకటి లేదని, ప్రతి ఒక్కరు చదువుకుని ఉన్నతంగా స్థిరపడాలనేది తమ లక్ష్యం అన్నారు. పేద కుటుంబంలో పుట్టి, ఆర్థిక స్తోమత లేక, ఉన్నత చదువులు చదవలేక మధ్యలో చదువు ఆపేసి ముందుకు వెళ్లలేని విద్యార్థులకు తమ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు అందిస్తున్నా మన్నారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువు ఆగకూడదనే తన కుమారుని ఉన్నత ఆశయం మేరకు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు.
ఇటీవల తమ ఫౌండేషన్ ద్వారా చేపట్టిన మెగా సాఫ్ట్ వేర్ జాబ్ మేళా ద్వారా 28 మంది నిరుద్యోగులకు ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించామని సంతృప్తి వ్యక్తం చేశారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా నిరుపేదలైన కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకుని చదివిస్తున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. పేదరికంలో ఉన్న తమకు లాప్టాప్ లు అందించిన సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం గారికి ఇరువురు విద్యార్థినిలు మౌనిక, మల్లేశ్వరిలు కృతజ్ఞతలు తెలియజేశారు.