“సనాతనం నిర్మూలించబడాలి” అని మళ్లీ ఉదయనిది స్టాలిన్ అన్నారు. ఉదయనిది స్టాలిన్ ‘సనాతన నిర్మూలన’ అంటూ లోగడ కూడా పేలాపన చెయ్యడం తెలిసిందే.
ఉదయనిది స్టాలిన్ ఇవాళ తమిళ్ష్నాడు శాసన సభలో ప్రతిపక్షనాయకుడు. ఒక ప్రతిపక్ష నాయకుడి స్థానంలో శాసనసభలోనే ఉదయనిది స్టాలిన్ “సనాతనం నిర్మూలించబడాలి” అనడం దేన్ని తెలియజేస్తోంది? ‘విజయ్ ప్రభుత్వంలోని తమిళ్ష్నాడు విదేశీ క్రైస్తవ పాలనలో ఉంది’ అన్న భయంకరమైన నిజాన్ని తెలియజేస్తోందా?
శాసన సభలో “సనాతనం నిర్మూలించబడాలి” అని ఉదయనిది అనాల్సిన అవసరం ఏమిటి?
ఉదయనిది, డీ.ఎమ్.కె. సనాతనాన్ని నిర్మూలించడానికి విదేశీ క్రైస్తవ మత మాఫియా నుంచి సుపారీ తీసుకున్నాయా? అందుకే ప్రతిపక్ష నాయకుడైన వెంటనే ఉదయనిది “సనాతనం నిర్మూలించబడాలి” అన్నారా?
రానున్న రోజుల్లో ఉదయనిది చేతిలో తమిళ్ష్నాడులోని సనాతనులు లేదా హిందువులు నిర్మూలించబడనున్నారా? విజయ్ ప్రభుత్వం అందుకు పూర్తి సహాయ సహకారాలు అందించబోతోందా?
“సనాతనం నిర్మూలించబడాలి” అని ఉదయనిది అన్నప్పుడు ముఖ్యమంత్రి విజయ్ మౌనం “సనాతనం నిర్మూలించబడాలి” అన్నదానికి ఆమోదమా? విజయ్ ప్రభుత్వం, ఉదయనిది ప్రతిపక్షం కలిసికట్టుగా సనాతనులు లేదా హిందువుల్ని నిర్మూలించనున్నారా? ఒక ముఖ్యమంత్రిగా శాసన సభలో ఆ మాటల్ని ఖండించకపోవడం అపాయ సూచకం.
తమిళ్ష్నాడులో హిందువులు పెను ఆపదలో ఉన్నట్టు ఉదయనిది మాటలు, విజయ్ మౌనం స్పష్టంగా సూచిస్తున్నట్టున్నాయి. ఈ ఆపద నుంచి తమిళ్ష్నాడు సనాతనులను లేదా హిందువులను కేంద్ర ప్రభుత్వమే రక్షించాలి.
మాననీయ ప్రధాని నరేంద్ర మోదీ గారూ! హోం మంత్రి అమిత్ షా గారూ! తమిళ్ష్నాడు హిందువులను రక్షించండి. మరో పశ్చిమ బెంగాల్ కాకుండా తమిళ్ష్నాడును రక్షించండి. తమిళ్ష్నాడులో సనాతనం నిర్మూలనం అవకుండా చర్యలు చేపట్టండి. తమిళ్ష్నాడులో హిందువులకు బతికే అవకాశం ఇవ్వండి.
“సనాతనం నిర్మూలించబడాలి” అని అంటున్న మత శక్తుల నుంచి హిందువులకు ప్రాణ భయం ఉంది.
“సనాతనం నిర్మూలించబడాలి” అని శాసన సభలోనే, ప్రతిపక్ష నాయకుడే అనడం సనాతనులకు తీక్ష్ణమైన ప్రమాద ఘంటిక. ‘సనాతనులు ఆధికారికంగా నిర్మూలించబడతారు’ అన్నదాన్ని ఆ మాటలు గట్టిగా తెలియజేస్తున్నాయా?
– రోచిష్మాన్
9444012279