అమరనాథ్ పుణ్యక్షేత్రం వరదల్లో చిక్కుకుపోయిన 37 మంది తెలుగు భక్తుల ఆచూకీ కనిపెట్టి వారి యోగ క్షేమాలు చూడాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి, కేంద్ర హోం సెక్రటరీ అజయ్ కుమార్ భల్లాకు, జమ్ము కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా లకు లేఖలు రాసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.
* అమరేంద్రుడు తెలుగు ప్రజల్లో చాలా ప్రసిద్ధి.
* ఏపీ నుంచి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని మరీ అమరేంద్రుడి దర్శనం చేసుకుంటున్నారు.
* ఈ ఏడాది సైతం అనేక మంది భక్తులు అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు.
* అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం వరదల్లో భక్తులు మరణించడం చాలా బాధాకరం.
* ఈ నేపథ్యంలో తప్పిపోయిన 37 మంది తెలుగు భక్తుల ఆచూకీ కోసం మీ దృష్టికి తీసుకొస్తున్నాను.
* ఆచూకీ తెలియక వారి
బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
గతంలో ఉత్తరాఖండ్ లాంటి వరదలు సంఘటనలు జరిగినప్పడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న తక్షణ సహాయక చర్యలను మాదిరి ప్రస్తుత ప్రభుత్వం స్పందించకపోవడం విస్మయంకలిగిస్తోంది.
* కష్టాల్లో ఉన్న తెలుగు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉంది.
* తప్పిపోయిన భక్తుల ఆచూకీ తక్షణమే కనుగొని వారికి వైద్య సహాయం, ఆహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
* భక్తులు వారి స్వస్థలాలు చేరుకోవడానికి ప్రయాణ ఏర్పాట్లు కూడా చేయండి.
* తప్పిపోయిన 37 మంది తెలుగు భక్తుల గురించి మీ తెలియజేసే సమాచారం బాధితులకు కుటుంబ సభ్యులకు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుందని తెలియజేస్తున్నాను.