సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

– హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్

నెల్లూరు : సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిహౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ భరోసా ఇచ్చారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని కోరారు.పదకొండు శాఖలతో అనుబంధం కలిగిన విభాగాలు ఉన్నందున ప్రొబేషన్ డీక్లేరేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. రాష్ట్రంలో అన్ని అర్హతలు కలిగిన వారు 60 వేల మంది ఉన్నట్లు ఇప్పటికే గుర్తించాం. మిగతావారు కూడా అర్హత సాధించిన వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేస్తాం. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చేపట్టిన నియామక ప్రక్రియ. ఇందులో ఎవ్వరికీ, ఎప్పుడూ అన్యాయం జరగదు. ఇబ్బందులు తలెత్తుతాయని సచివాలయ ఉద్యోగులు భావించాల్సిన అవసరం లేదు. కొందరు ఉద్దేశపూర్వకంగా సచివాలయ ఉద్యోగుల ను రెచ్చ గొడుతున్నారు. అపోహలు సృష్టించే ప్రక్రియ చేస్తున్నారు. వారి మాటలను నమ్మి మోసపోవద్దు. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ డిక్లరేషన్ పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలి అని అన్నారు.

Leave a Reply