Suryaa.co.in

Andhra Pradesh

సింగపూర్‌లోని ప్రతిష్టాత్మక ఎన్టీయూ ఇంటర్న్‌షిప్‌కు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన నలుగురు బీటెక్‌ విద్యార్థులు సింగపూర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తొమ్మిదో ర్యాంకు యూనివర్సిటీ ఎన్టీయూ ( నన్యాంగ్‌ టెక్నాలజికల్‌ యూనివర్సిటీ)లో ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఇంచార్జి వీసీ మాట్లాడుతూ భారతదేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి అతికొద్ది మంది విద్యార్థులను ఎంపిక చేసుకొనే ఎన్టీయూకు తమ యూనివర్సిటీ నుంచే నలుగురు విద్యార్థులు ఎంపికవడం గర్వకారణమన్నారు.
సింగపూర్‌లోని ఎన్టీయూ నిర్వహించిన ఆన్‌లైన్‌ ఎంపికలలో తమ యూనివర్సిటీలోని బయో ఇన్ఫర్మాటిక్స్‌ విభాగానికి చెందిన వై.సౌమ్య, ఎం.అభిజీత్‌ సాయి, కే.శివరామక్రిష్ణ, సీఎస్‌ఈ విభాగానికి చెందిన సజ్జ రేఖా సామ్రాజ్యుత అనే విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనపరిచి 6 నెలల పాటు జరిగే ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యారని తెలియజేసారు. బయో ఇన్ఫర్మాటిక్స్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులకు ఎన్టీయూలోని ప్రొఫెసర్‌ విల్సన్‌ ఘో గైడ్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
వీరు ‘‘ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆన్‌ ప్యాండమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌’’ ప్రాజెక్టును ఏఐ అండ్‌ కాంప్లెక్స్‌ సిస్టమ్‌ మెథడ్స్, నెట్‌వర్క్‌ అనాలిసిస్, రోబొస్ట్‌ స్టాటిస్టికల్‌ మోడల్‌ బిల్డింగ్, టైమ్‌ సిరీస్, స్టాకింగ్‌ మోడల్స్‌ అండ్‌ రాండమ్‌ సిగ్నేచర్‌ అనాలసిస్‌ స్టూడెంట్స్‌ ఏయిమ్డ్‌ టు డెవలప్‌ ప్లాట్‌ఫార్మ్స్‌ అనే సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ను వినియోగించి ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. సీఎస్‌ఈ విభాగానికి చెందిన రేఖా సామ్రాజ్యుతకు ఎన్టీయూలోని సీఎస్‌ఈ ప్రొవోస్ట్‌ చైర్‌ ఎరిక్‌ కేంబ్రియా గైడ్‌గా వ్యవహరించనున్నారు. ఈమె సెంటిమెంట్‌ అనాలిసిస్‌ అనే అంశంపై ప్రాజెక్టును పూర్తి చేయనుంది.

LEAVE A RESPONSE