తర్జుమా తో వచ్చిన తిప్పలు
గతంలో పలుమార్లు (నిమ్మగడ్డ అంశంలో గవర్నర్ ఆదేశాలు మాతృబాషలో బోధన వగైరా) ఆంగ్ల ఉత్తర్వులు ఒకరకంగా ఉంటే తెలుగులో తర్జుమా మరోరకంగా చేస్తూ జగన్ అనుకూల మేధావులు జనాన్ని మభ్య పెట్టే ప్రయత్నం చేశారు అది తప్పు అని వివరంగా రాశాను ఇపుడు సుప్రీం లో అదే తరహా మభ్యపెట్టే ప్రయత్నం. వీళ్లే ఇలా ఉంటే ప్రస్తుతం అటు ఆంగ్ల ఇటు తెలుగు రెండూ రాక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు భవిష్యత్తులో ఎలా ఉంటారో అనే మరో ఆందోళన కూడా మొదలైంది. ఇక విషయానికి వస్తే..
సుప్రీంలో బాబు బెయిల్ రద్దు పిటీషన్ పై సవివరంగా నిన్ననే రాశాను. అయితే నేటి విచారణ లో న్యాయమూర్తి వ్యాఖ్యలను ఎవరికి అనుకూలంగా వారు రాస్తున్నారు. కొందరు ఆంగ్లం రాక జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. Livelaw లో న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ప్రకారం .
Trivedi J: Let the first part (bail condition enjoining Naidu from speaking about the sub judice case in public domain) remain, the second part…you can take part in rallies.
కేసుపై మాట్లాడకూడదు
ర్యాలీలో పాల్గొనవచ్చు
Trivedi J pronounces order –
“Issue notice. Returnable on December 8. All the conditions imposed by November 3 order by the high court shall continue except the condition of organising or participating in public rallies or meetings. List on December 11.”
నోటీసులు ఇవ్వండి డిసెంబర్ 11 లిస్టులో చేర్చండి నవంబర్ 3 ఆదేశాల్లో ఉన్న కండిషన్లు కొనసాగుతాయి కానీ ర్యాలీలు సమావేశాలు నిర్వహించకూడదు అనేదానికి మినహాయింపు
Bench of Justices Bela M Trivedi and Satish Chandra Sharma adjourns the proceedings till the verdict of another SLP seeking quashing of FIR in the skill development case is delivered.
క్వాష్ పై తీర్పు వచ్చేవరకు వాయిదా! ఇదీ క్లుప్తంగా సారాంశం.
ఇప్పుడు చెప్పండి అబ్బాయిలూ..
షాక్ ఇచ్చింది బాబుకా? జగన్ సర్కారుకా?
– హర్షవర్ధన్‌రెడ్డి