– మీ ఇంటికి కారు రావాలంటే మాగంటి సునీత గెలవాలి
– మా ఇండ్లు కూల్చేందుకు బుల్డోజర్లకు మేమే లైసెన్స్ ఇస్తాం అంటే కాంగ్రెస్ గెలవాలి
– బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి
హైదరాబాద్: ప్రభుత్వ వ్యతిరేకత ఈ ఉప ఎన్నిక తో తెలుస్తుంది ఈ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సూచిక అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా షేక్ పేట్ డివిజన్ పరిధిలోని పారామౌంట్ గేట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటింటికి వెళ్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని దివగంత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పడిన కష్టం రాష్టం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలలో ప్రతి ఒక్కరు లబ్ధి పొందారని, హైదరాబాద్ అభివృద్ధి లో ఐటీ అభివృద్ధి లో పెట్టుబడులలో కేసీఆర్ ముఖ్య పాత్ర పోషించారు. కాంగ్రెసులో మంత్రుల గొడవలు, సెటిల్మెంట్లు ఇవే ఉన్నాయి. పేదల కు కావలసిన కనీస వసతులు కూడా ఇవ్వని అసమర్థత ప్రభుత్వానికి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు