Suryaa.co.in

Andhra Pradesh

అంగన్ వాడీ సిబ్బందిని వంచించినందుకు జగన్ రెడ్డికి పాలాభిషేకాలు చేయాలా?

•జీతాలు పెంచుతానని చెప్పి, అంగన్ వాడీసిబ్బందిని వంచించినందుకు జగన్ రెడ్డికి పాలాభిషేకాలు చేయాలా?
•పాలు, పూల అభిషేకాలుచేసే టైమ్ ఎప్పుడో అయిపోయింది… ఇక ముఖ్యమంత్రికి చేయాల్సింది రాళ్లాభిషేకాలు, బడితె పూజలే
• రాష్ట్రంలో ఇకపై ఏ వర్గం మహిళలు తమకు అన్యాయంజరిగిందని రోడ్లపైకి వచ్చినా, వారితో కలిసి తాడేపల్లి ప్యాలెస్ ముట్టడిస్తాం
• జగన్ రెడ్డి ప్రభుత్వంలో వంచనకుగురికాకుంగా ఏ మహిళైనా ఉందా?
• జగన్ రెడ్డి అంటేనే నమ్మకద్రోహం ప్లస్ నయవంచన.
•తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

మూడేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనచూశాక, రాష్ట్రంలోని ఆడబిడ్డలు అంతా ఆయనపాలనకు నయవంచన ప్లస్ నమ్మకద్రోహం = జగన్మో హన్ రెడ్డి అనేసరికొత్త నిర్వచనంఇచ్చారని, సీఎం అయినప్పటి నుంచీ మహిళలను వంచించడమే జగన్ రెడ్డి పనిగాపెట్టుకున్నా డని, తనతల్లిచెల్లీ ఉదంతమే అందుకు నిదర్శరనమని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వంగ లపూడి అనిత స్పష్టంచేశారు.బుధవారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమెమాటల్లోనే …

తనతొత్తులుగా ఉన్నపోలీసులతో చంటిబిడ్డలకు అన్నంపెట్టే అంగన్ వాడీలనుకూడా అరెస్ట్ లుచేయించడం చూస్తేనే జగన్ రెడ్డి నయవంచన ఏమిటో అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం లో ఉన్నప్పుడు తలలు, బుగ్గలు నిమిరిన జాబితాలో అంగన్ వా డీ సిబ్బందికూడా ఉన్నారు. వారంతా ఆనాడు ఇతగాడి మోసపు మాటలునమ్మి, తమ జీతాలుపెంచుతాడని భావించారు. తీరా అధికారంలోకి రాగానే అదే అంగన్ వాడీసిబ్బందికి మహిళలనే కనికరంలేకుండా పోలీస్ దెబ్బలు రుచిచూపించాడు ఈ జగన్ రెడ్డి. చంద్రబాబునాయుడి గారిహాయాంలోనే అంగన్ వాడీల జీతం రూ.10,500లకుపెంచుతూ జీవోఇస్తే, దాన్ని తానేఇచ్చినట్లుగా ఈముఖ్యమంత్రి చెప్పుకోవడం సిగ్గుచేటుకాదా? అంగన్ వాడీలు రూ.26వేలజీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే, కేవలం రూ.1000లు మాత్రమే పెంచి, రూ.11,500లకు పరిమితం చేసి, వారినేదో ఉద్ధరిస్తున్నట్లుగా జగన్ రెడ్డి కబుర్లుచెబుతున్నాడు.

అంగన్ వాడీ టీచర్స్ గా పనిచేసినవారికి అంగన్ వాడీ సూపర్ వైజర్లు అయ్యే అర్హతఉందని గతంలో చంద్రబాబునాయుడుగారే జీవోఇస్తే, దాన్నికూడా ఈ ముఖ్యమంత్రి నిలిపేశాడు. ఆ జీవోని కూడా తుంగలోతొక్కిన జగన్ రెడ్డి, ఈ రెండున్నరేళ్లలో అంగన్ వాడీ టీచర్లను రోడ్లపాలుచేశాడు. ఇంతాచేసి, సిగ్గులేకుండా అంగన్ వాడీలను తానేదో ఉద్ధరించినట్లు సాక్షి పేపర్లో తప్పుడురా తలు రాయించుకుంటున్నాడు. ఏది రాసినా, ఏమైనా దాన్ని నిర్వ హిస్తున్న భారతిరెడ్డికే ఇబ్బంది అవుతుందిలేఅన్నఉద్దేశంతో, ఆ విధంగా రాయించుకుంటున్నాడేమో మరి! జగన్ రెడ్డిని తుగ్లక్ రెడ్డి.. తుగ్లక్ రెడ్డి అంటుంటే ఎందుకిలా అంటున్నారా అనుకునే వాళ్లం. కానీ అంగన్ వాడీసిబ్బంది తనకు పాలాభిషేకాలు చేయ మనిచెప్పినప్పుడు అర్థమైంది జగన్ రెడ్డి తుగ్లక్ రెడ్డి = పులకేశి రెడ్డి. అంగన్ వాడీ సిబ్బంది ప్రభుత్వతీరుని, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు వైఖరిని నిరసిస్తూరోడ్లెక్కిధర్నాలుచేస్తే, అందుకు ప్రాయశ్చిత్తంగా తనచిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించాడంటున్నారు.
జగన్ రెడ్డికి పాలాభిషేకం, పూలఅభిషేకం చేయడం వంటివి అయిపోయాయి. ఆయన ఒక్క సారి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకువస్తే రాళ్లతోఅభిషేకం చేయడానికి ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఇంకాస్త ముందుకొ చ్చి మహిళలైతే బడితెపూజచేయడానికి సిద్ధంగా ఉన్నారు.

రాష్ట్రంలో మహిళలు కన్నీళ్లుపెట్టినప్పుడే జగన్ రెడ్డి పతనం ప్రారంభమైంది. మరీముఖ్యంగా అమరావతి మహిళల్ని పోలీసుల బూటుకాళ్లతో తన్నించినప్పుడే జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభ మైంది. అమరావతి మహిళల్ని, అంగన్ వాడీసిబ్బందిని, ఆశా వర్కర్లను ఇలా అందరినీ రోడ్లపైకి తీసుకొచ్చింది జగన్ రెడ్డికాదా? అందరికంటే దారుణంగా తనసొంతచెల్లి, తల్లినికూడా తనస్వార్థాని కి వాడుకొని వదిలేశాడంటే..అదీ జగన్ రెడ్డి నయవంచన.

అంగన్ వాడీ సిబ్బంది ఎందుకు రోడ్లపైకి వచ్చారో, ఎందుకు ధర్నా లుచేస్తున్నారో తెలుసుకోకుండా ప్రభుత్వంలోని మంత్రులు, మరీ ముఖ్యంగా మహిళామంత్రులు నిస్సిగ్గుగా జగన్ రెడ్డి భజన చేస్తున్నారు. అసలు కేబినెట్ లో మహిళామంత్రులు ఉన్నారనే వాస్త వాన్నిప్రజలుఎప్పుడో మర్చిపోయారు.ఈ జగన్ రెడ్డి జీతాలు పెంచుతాననిచెప్పబట్టేకదా అంగన్ వాడీ లు తమజీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.26వేలు ఇస్తాననిచెప్పి, కేవలం రూ.11,500లు మాత్రమేఇస్తున్న జగన్ రెడ్డి, అంగన్ వాడీసిబ్బందితో గొడ్డుచాకిరీ చేయిస్తున్నాడు. పెరిగినధరలు, ఇతరత్రాపన్నులు చెల్లిస్తూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంగన్ వాడీలు రూ.11వేలతో కుటుంటా లను పోషించుకోగలరా? ఆ విషయం ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచించడు? తాడేపల్లి ప్యాలెస్ లోకూర్చొని ఏంచేస్తున్నాడో తెలియకుండా పోలీసులతో లాఠీఛార్జ్ లుచేయిస్తూ, గృహనిర్బంధా లుచేయిస్తూ జగన్ రెడ్డి కాలంవెళ్లదీస్తున్నాడు.

ఇకపై ఏవర్గంలోని మహిళలకు ముఖ్యమంత్రి అన్యాయంచేసినా, వారిపై పోలీసులను ప్రయోగించినా, ఆయన తాడేపల్లిఇంటినే ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. జగన్ రెడ్డికి భజనచేసే వారైనా, ఆయనకు అర్థ మయ్యేలా వాస్తవాలుచెబితే మంచిది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో వంచనకు గురైన అన్నివర్గాల మహిళలకు, రేపు చంద్రబాబు గారు అధికారంలోకిరాగానే న్యాయం చేస్తారు.

LEAVE A RESPONSE