– ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు
గుంటూరు: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి గా పోటీలో ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని గెలిపించాలని అలాగే గ్రాడ్యుయేట్ లను ఓటర్లు గా చేర్పించాలని ఆదివారం గుంటూరు ఆలపాటి రాజా కార్యాలయం లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, వేమూరు శాసన సభ్యుడు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు.
నక్కా ఆనందబాబు ఏమన్నారంటే… కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆలపాటి ని ఎంపిక చేశారు. ఓటరు గా నమోదు అవ్వడానికి మరో మూడు రోజులే సమయం ఉంది. పట్టభద్రులు, ఉద్యోగస్తులు అందరూ త్వరగా ఓటరుగా నమోదు చేసుకోవాలి.
ఆలపాటి కి ప్రతి ఒక్కరు సంపూర్ణ మద్దతూ తెలుపుతున్నారు. అందరు తమ బాధ్యతగా ఓటుహక్కును వినియోగించుకోవాలి. నూరు భాష సంఘ నాయకులు సమావేశం ఏర్పాటు చేసి సంపూర్ణ మద్దతుగా తెలిపారు.