అనుచరులతో లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక
ఉండవల్లి: అధికార వైసీపీకి గుంటూరు జిల్లాలో భారీ షాక్ తగిలింది. గుంటూరుకు చెందిన సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి, కరస్పాండెంట్ శిరీష శనివారం యువనేత నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో భరత్ రెడ్డి, ఆయన సతీమణి శిరీషలకు లోకేష్ పసుపుకండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
వైసిపి, కాంగ్రెస్ పార్టీల్లో వివిధ పదవుల్లో ఉన్న వారి అనుచరులు కూడా యువనేత సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనుచరులు శంకర్ రెడ్డి, సిద్ధార్థ, అరవింద్, షోయబ్, దినేష్ రెడ్డి, నవీన్ రెడ్డి, హరీష్ రెడ్డి, మన్సూర్, మన్సూర్ గయాజ్, బేగ్, కృష్ణ, బుజ్జి. వెంకటేశ్వరరావు, నరేష్, వెంకటేశ్వరరావు, బాలయ్య, సుబ్బారావుతో పాటు పలువురు పార్టీలో చేరారు.
వీరిని లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భరత్ రెడ్డి మాట్లాడుతూ….రాష్ట్రంలో టీడీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని అన్నారు. టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా అద్భుతంగా ఉందని, టీడీపీ విజయానికి శక్తివంచన లేకుండా పని చేస్తామని భరత్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలంటే విజనరీ లీడర్ చంద్రబాబుతోనే సాధ్యమని పేర్కొన్నారు.