Suryaa.co.in

Andhra Pradesh

మంగళగిరిలో ఖాళీ అవుతున్న వైసిపి నావ!

-లోకేష్ సమక్షంలో పెద్దఎత్తున టిడిపిలోకి చేరికలు
-కండువా కప్పి ఆహ్వానించిన యువనేత లోకేష్

ఉండవల్లి : మంగళగిరి నియోజకవర్గంలో వైసిపికి రోజుకో షాక్ తగులుతోంది. ఎన్నికల సమయానికి ఎవరు ఆ పార్టీలో ఉంటారో, ఎవరు వెళ్లిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది. వైసీపీ మునిగిపోతున్న నావ అని గమనించిన పలువురు ప్రముఖులు ఆ రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. తాజాగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 180 కుటుంబాలు శనివారం యువనేత లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు.

ఉండవల్లిలోని చంద్రబాబునాయుడు నివాసంలో లోకేష్ పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని సాదరంగా కండువాకప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మంగళగిరి అభివృద్ధి కోసం తమ వెంట వస్తున్న నేతలను అభినందించారు. పార్టీలోకి వచ్చిన వారిని ఇప్పటికే పనిచేస్తున్న నేతలు కలుపుకొని ముందుకుసాగాలని సూచించారు.

తాడేపల్లి పట్టణానికి చెందిన పల్లెపోగు అరుణ్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు, చింకా శ్రీనివాస్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు, 11వ వార్డుకు చెందిన 30 కుటుంబాలు, మంగళగరి పట్టణానికి చెందిన అవ్వారు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు, చిర్రావూరుకు చెందిన రెడ్డి విజయ్, మేడూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు పార్టీలో చేరాయి.

ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకి దేవి, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు, మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE