Suryaa.co.in

Editorial

రేవంత్.. కేసీఆర్‌కు సెంటి‘మంట’

  • తెలంగాణలో ‘ఐరెన్‌లెగ్’పై ‘సోషల్’ వార్

  • సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లిన రాష్టాల్లో ఓటమి అంటూ బీఆర్‌ఎస్ మైండ్‌గేమ్

  • రేవంత్‌ది ఐరన్‌లెగ్ అంటూ మానసిక ప్రచారానికి తెరలేపిన బీఆర్‌ఎస్

  • రేవంత్‌ది ఐరన్‌లెగ్.. భట్టిది గోల్డెన్‌లెగ్ అంటూ కాంగ్రెస్‌లో కొత్త ప్రచారం

  • పోతూ పోతూ నలుగురిని తీసుకువె ళ్లడమంటే ఇదేనేమో నంటూ కేసీఆర్‌పై రేవంత్ సోషల్‌మీడియా దళం ఎదురుదాడి

  • గతంలో కేసీఆర్ కలసిన వారంతా ఓడిపోయారంటూ రివర్స్‌గేర్

  • కాంగ్రెస్-బీఆర్‌ఎస్ సోషల్‌మీడియా వార్‌ను ఆస్వాదిస్తున్న బీజేపీ

  • అంతిమంగా తనకే లాభిస్తుందన్న అంచనాతో బీజేపీ

( మార్తి సుబ్రహ్మణ్యం)

రాజకీయాల్లో ఎంత కొమ్ములు తిరిగిన మొనగాడయినా సెంటి‘మంట’కు వణికిపోవాల్సిందే. ఫలాన సీఎం ఫలానా చోటకు వెళ్లిన వెంటనే మాజీగా మారిపోతారన్న సెంటిమెంటు నిజమైన తర్వాత, ఇక ఏ సీఎం కూడా ఆ ప్రాంతానికి వెళ్లరు. ఫలానా మంత్రి ఫలానా గుడికి వెళితే మాజీగా మారతారన్న సెంటిమెంట్ ఏర్పడితే, ఇక ఏ మంత్రీ అక్కడికి వెళ్లేందుకు సాహసించరు. ఇది కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలను ఫాలో అవుతున్న వారందరికీ తెలిసిందే.

ఇప్పుడు ఆ సెంటి‘మంట’ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారానికి వెళ్లిన అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో.. ఆయనది ఐరన్‌లెగ్ అన్న మానసిక ప్రచారం విసృ్తతమయింది. అంటే హర్యానా, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి విసృ్తతంగా ప్రచారం చేసినా.. కాంగ్రెస్ పిండం గట్టెక్కలేదు.

సరికదా.. ఢిల్లీ ఎన్నికల్లో డిపాజిట్లు దక్కి,చుకున్న సంఖ్య డజను కూడా దాటని విషాదం. అప్పటికీ పాపం.. కాంగ్రెస్ హామీలను నెరవేర్చే బాధ్యత తాను తీసుకుంటానని, రేవంత్ చెవినిల్లు కట్టుకుని చెప్పినా, ఢి ల్లీ ఓటరు కనీసం కనికరించలేదు. మహారాష్ట్ర ప్రచారానికి వెళ్లి.. కాంగ్రెస్ హామీలు అమలుచేసే బాధ్యత నేను తీసుకుంటానని ఎంత గంభీరంగా చె ప్పినా, మరాఠా ఓటరు ఆయనను లైట్ తీసుకున్నారు. పక్క రాష్ట్రం వాడన్న దయలేకుండా, కాంగ్రెస్‌ను దారుణంగా ఓడించారు.

దీనిని సద్వినియోగం చేసుకున్న బీఆర్‌ఎస్.. రేవంత్‌రెడ్డిది ఐరన్‌లెగ్ అని.. ఆయన ఇనుపపాద’ మహత్యంతో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందంటూ, సోషల్‌మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలకు తెరలేపింది. ఆ మేరకు రేవంత్ వెళ్లిన రాష్ట్రాలు.. అక్కడ కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు, బీజేపీ గెలిచిన స్ధానాలను గ్రాఫిక్‌రూపంలో సోషల్‌మీడియాలో చర్చకు పెట్టింది. ‘రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలో మొదలుపెట్టిన కాంగ్రెస్ పతనాన్ని ఢిల్లీతో ముగించార’ంటూ.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యను ప్రముఖంగా ప్రచారంలో పెట్టింది.

కాగా అటు కాంగ్రెస్‌లో సైతం.. రేవంత్‌ది ఐరన్‌లెగ్ అయితే, భట్టిది గోల్డెన్‌లెగ్ అంటూ మరో వర్గం సరికొత్త ప్రచారానికి తెరలేపింది. రేవంత్‌రెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేసిన అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతే.. భట్టి ఇన్చార్జిగా ఉన్న జార్ఖండ్‌లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి కాంగ్రెస్‌లో ఐరన్‌లె గ్గే కాదు. గోల్డెన్‌లెగ్గూ ఉందన్న ప్రచారానికి కాంగ్రెస్‌లోని ఓ వర్గం కొత్త ప్రచారానికి తెరలేపింది. అంటే భట్టి పట్టుకున్నదల్లా బంగారమనే రేంజ్‌లో ప్రచారం మొదలయింంద న్నమాట. ఇది ఎవరికి లాభం? ఎవరికి నష్టమన్నది ప్రతే్యి ంచి చెప్పాల్సిన పనిలేదు.

దానితో ఎదురుదాడికి దిగిన రేవంత్ వర్గం.. కేసీఆర్ లక్ష్యంగా అదే సెంటి‘మంట’ను రగిల్చింది. అంటే.. మా రేవంత్‌ది ఒక్కటే కాదు. మీ కేసీఆర్‌దీ ఐరన్‌లెగ్గే’నని చెప్పడం దాని లక్ష్యమన్నమాట! ఆ ప్రకారంగా కేసీఆర్‌ది కూడా ఐరన్‌లెగ్గేనన్నది, రేవంత్ సోషల్‌మీడియా బృందం కవిహృదమన్నమాట.

నిజానికి కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియా వీక్. అయితే రేవంత్‌రెడ్డి వ్యక్తిగత సోషల్‌మీడియా టీమ్ పవర్‌ఫుల్. ఆయనను పైకి లేపేందుకు కొన్ని దళాలు నిరంతరం అవిశ్రాంతంగా పనిచేస్తుంటాయి. ఆ దళాలు కాంగ్రెస్ పార్టీ కంటే, రేవంత్‌ను వ్యక్తిగతంగా పైకిలేపడానికే కృషి చేస్తుంటాయన్నది బహిరంగ రహస్యమే.

రేవంత్‌ది ఐరన్‌లెగ్ అంటూ, సోషల్‌మీడియాలో సెంటి‘మెంట’ రగిల్చిన బీఆర్‌ఎస్ ప్రచారానికి ధీటుగా.. రేవంత్ సోషల్‌మీడియా దళం కూడా, బీఆర్‌ఎస్‌కు అదే సెంటి‘మంట’ పెట్టడం ఆసక్తికరంగా మారింది. అందులో భాగంగా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కలిసిన ప్రముఖులందరూ ఓడిపోయారంటూ.. ‘‘తనతో పాటు నలుగురిని వెంటతీసుకెళ్లడమంటే ఇదేనేమో’’ నన్న వ్యంగ్యాస్త్రంతో, ఎదురుదాడికి తెరలేపింది.

సీఎంగా కేసీఆర్ కత్తికి ఎదురులేని రోజుల్లో.. ఆయన అప్పటి ఒడిషా సీఎం పట్నాయక్, ఏపీ సీఎం జగన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ధాక్రే, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామిని కలసిన ఫొటోలు పెట్టారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వారు నాయకత్వం వహించిన పార్టీలు మట్టికరిచాయి. అంటే.. కేసీఆర్ కలిసిన వారంతా ఎన్నికల్లో మట్టికరిచారన్నది, రేవంత్ సోషల్‌మీడియా దళం కవిహృదయమన్నమాట.

ఏదైతేనేం.. సెంటిమెంట్‌లో దొందూ దొందేనన్నది నె టిజన్ల కామెంట్లు. కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్న ఈ సెంటిమెంట్ యుద్దాన్ని, బీజేపీ మహదానందంగా తిలకిస్తోంది. ఈ ఐరన్‌లెగ్ సెంటిమెంట్ ప్రచారం ఎంత విస్తృతంగా జనక్షేత్రంలోకి వెళితే, తనకు రాజకీయంగా అంత లాభమన్నది కమలదళాల అసలు ఆనందం. ఎవరి తుత్తి వారిది మరి!

LEAVE A RESPONSE