– ఈ దోపీడీ వెనక కేటీఆర్, కేసీఆర్ ఉన్నారు
– కెటీఆర్ ను జైల్లో పెట్టే వరకు పోరాడుతాం
– ఇది వేల కోట్ల కుంభకోణం…. ఇది ప్రభుత్వ ఆస్తిని తెగనమ్మడమే
– బంగారు బాతును కేటీఆర్ 30 ఏళ్లకు ఓఆర్ఆర్ ను తెగనమ్మారు
– ఏడాదికి 750కోట్లు వస్తుంటే 246కోట్లకే ముంబై కంపెనీకి కట్టబెట్టింది
– ఆరునెలల్లో దిగిపోయే ముందు ప్రభుత్వం ఓఆర్ఆర్ ను అమ్ముకున్నారు
– అరవింద్ కుమార్ ఇక్కడ లేడు, అక్కడ లేడు… మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడా?
– పరిపాలన భవనంలోకి ఎంపీ కి అనుమతి ఎందుకు?
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ ను నిర్మించింది. భవిష్యత్ తరాలకు వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చాలని, అభివృద్ధిని అందించాలని ఓఆర్ఆర్ నిర్మించింది. 6696 కోట్లు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఖర్చు చేసిన డబ్బులను తిరిగి రాబట్టుకోవడానికి టోల్ విధానం ప్రభుత్వం తీసుకొచ్చింది.
హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసి టోల్ వసూలు చేసే ఏర్పాటు చేసింది. ప్రతీ ఏటా ప్రభుత్వానికి 750 కోట్ల టోల్ ఆదాయం ఉంది. అలాంటి ఆదాయం ఉన్న ఓఆర్ఆర్ ను ముంబై సంస్థకు బీఆరెస్ ప్రభుత్వం కట్టబెట్టింది. 7388 కోట్లకు Irb సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. ఏడాదికి 750కోట్లు వస్తుంటే 246కోట్లకే ముంబై కంపెనీకి కట్టబెట్టింది. బంగారు బాతును కేటీఆర్ 30 ఏళ్లకు ఓఆర్ఆర్ ను తెగనమ్మారు. ఆరు నెలల్లో దిగిపోయే ముందు ప్రభుత్వం ఓఆర్ఆర్ ను అమ్ముకున్నారు.
నిన్నటి నుంచే సెక్రటేరియట్ నుంచి పరిపాలన సాగుతుందని కేసీఆర్ చెప్పారు. అంబేద్కర్ సిద్ధాంతాల గురించి ఉపన్యాసం ఇచ్చి..24 గంటలు తిరక్కముందే మరిచారు. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఎమ్మెల్యేలు, ఎంపీలను సచివాలయానికి రాకుండా అడ్డుకోలేదు. టోల్ కు సంబంధించి టేబుడర్ ప్రక్రియ లో పాల్గొన్న కంపెనీల వివరాలు ఆర్టీఐ ద్వారా అడిగేందుకు వెళ్లా. కానీ పోలీసులు చుట్టుముట్టి నన్ను అడ్డుకున్నారు.
హెచ్ఎండీఏ కార్యాలయం ఇంకా షిఫ్ట్ కాలేదని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి వచ్చి దరఖాస్తు ఇస్తే అక్ నాలెడ్జి పై రబ్బరు స్తాంప్ కూడా వేయలేదు. సెక్రటేరియట్ కు షిఫ్ట్ అయ్యిందని సమాధానం ఇచ్చారు.
అరవింద్ కుమార్ ఇక్కడ లేడు, అక్కడ లేడు… మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడా? నయా తెలంగాణ ఈడీ అమీన్ ను సెక్రటేరియట్ లో గొయ్యి తీసి పాతిపెడతారు.లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను అమ్ముకున్నారు.ఇది వేల కోట్ల కుంభకోణం…. ఇది ప్రభుత్వ ఆస్తిని తెగనమ్మడమే. ఈ దోపీడీ వెనక కేటీఆర్, కేసీఆర్ ఉన్నారు.
పోలీసులతో రాజ్యాన్ని నడుపుతున్నారు.రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగడం లేదు. దీనిపై విచారణ సంస్థలకు పిర్యాదు చేస్తాం.. న్యాయస్థానాల తలుపు తడతాం..కెటీఆర్ ను జైల్లో పెట్టే వరకు పోరాడుతాం.బీఆరెస్ ను ప్రజలు బొంద పెట్టే రోజు దగ్గర్లోనే ఉంది.
పరిపాలన భవనంలోకి ఎంపీ కి అనుమతి ఎందుకు? కిలోమీటర్ దూరంలోనే నన్ను అడ్డుకున్నారు.. కనీసం గేటు వరకు కూడా రానివ్వలేదు.అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మొత్తం టెండర్ల పై విచారణ చేయిస్తాం ఇందులో ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు.