Suryaa.co.in

Andhra Pradesh

త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం

– త్వరలో లక్షమందితో బహిరంగ సభ
– త్వరలో విజయవాడలో పార్టీ కేంద్ర కార్యాలయం
– వీజీఆర్ నారగోని

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు,వివిధ వర్గాల ప్రతినిధులతో సమగ్ర చర్చ తర్వాత కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలని నిర్ణయించాం.రాష్ట్రంలో దాదాపు 50 కులాల వారు అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయారు. ఒక్క బీసీ వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కాలేదు. రెండు మూడు వర్గాలకే అధికారాన్ని పరిమితం చేస్తూ, బలహీన వర్గాలను ఓటుబ్యాంకుగా పరిమితం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాలను సంఘటితం చేసి .. త్వరలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నాం.ఇది రాజకీయ, చారిత్రిక అవసరం. వివిధ పార్టీల్లోని నేతలు ఈ పార్టీలోకి రానున్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజ్యాధికారంలో వాటా రావాలి. కొత్త పార్టీ ఏర్పాటుతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు తారుమారు కానున్నాయి. త్వరలో లక్షమందితో బహిరంగ సభ నిర్వహిస్తాం. పార్టీ జెండా, అజెండా రూపకల్పన జరుగుతోంది. అధికార వికేంద్రీకరణ, సమన్యాయం సాధించబోతున్నాం. త్వరలో విజయవాడలో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమవుతుంది.

పాలూరి రామకృష్ణయ్య
సీట్ల కోసం ప్రాధేయపడే స్థితి నుంచి శాసించే స్థాయికి బడుగు బలహీన వర్గాల వారిని తీసుకెళ్తాం.
ఇప్పటివరకు రాష్ట్రాన్ని పాలించిన వారి వల్ల బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలకు ఒరిగిందేమీ లేదు.

ఆకురాతి మురళీకృష్ణ, రిటైర్డ్ ప్రొఫెసర్
అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా, ఏ కులం వారు వచ్చినా ప్రజలకు చేసిందేమీ లేదు. రాజకీయం మొత్తం అవినీతిమయంగా మారింది. పాలకులెవరైనా వారి వారి సొంతకులాల వారిని కూడా పేదరికం నుంచి విముక్తులను చేయలేకపోయారు. పైగా.. బలహీనవర్గాల వారి సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితుల్లో మార్పు తేలేకపోయారు.

పార్టీలన్నీ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయాయి. అందరికీ సమాన అవకాశాలు అందించడంలో విఫలమై, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కాలరాశారు. పరస్పరం తిట్టుకోవడం తప్ప, బాధ్యతాయుతంగా వ్యవహరించడం మర్చిపోయారు. కులవృత్తులను నిర్వీర్యం చేసి, సుపరిపాలనను మృగ్యంగా మార్చారు. బడుగు బలహీన వర్గాల వారు అధికారం చేపట్టడమే దీనికి పరిష్కారం. సామాజిక న్యాయాన్ని సాధించడమే లక్ష్యంగా కొత్త పార్టీని నిర్మిస్తున్నాం.

LEAVE A RESPONSE