త్వరలో పీల్చే గాలికి కూడా పన్ను

-రాష్ట్రంలో మహిళలు రోడ్లపై తిరగే పరిస్థితిలేదు
-రూ.2,200కోట్లు మహిళలకు చెందిన డబ్బులు జగన్ రెడ్డి దోచేశాడు
-పూతలపట్టు నియోజకవర్గం శేషాపురంలో మహిళలతో యువనేత నారా లోకేష్ ముఖాముఖి

మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది టీడీపీ వల్లే.2014లో మనకు లోటు బడ్జెట్, ఆర్థిక ఇబ్బందులున్నా…పసుపు కుంకుమ కింద రూ.20వేల కోట్లు ఇచ్చాం.2019లో ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి…మహిళల్ని మోసం చేశాడు.45సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు పెన్షన్ ఇస్తానని చెప్పి, మోసం చేశాడు. దిశ చట్టాన్ని కాగితాలకే పరిమితం చేశారు. కానీ దిశ పోలీస్ స్టేషన్లు, స్కూటీలు అలంకారప్రాయంగా పెట్టారు.రాష్ట్రంలో మహిళలు రోడ్లపై తిరగే పరిస్థితిలేదు. కేంద్రం పార్లమెంటులో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ… ఆంధ్రప్రదేశ్ లో 52,587మంది మహిళలపై దాడులు జరిగాయని, 900మహిళలు చనిపోయారని చెప్పింది. ఈ కేసుల్లో నిందితులకు ఒక్కరిపైన అయినా దిశ చట్టం ప్రకారం 21రోజుల్లో ఉరిశిక్ష పడిందా?

దశలవారీగా మద్యపాన నియంత్రణ చేస్తానని…రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. మహిళల మాంగల్యాలు తెంచుతున్నాడు.కల్తీ మద్యాన్ని తయారు చేసేది జగన్, తన బినామీలే. తయారీ, రావాణా, అమ్మకాలు మొత్తం వైసీపీ మనుషులే. బ్లాక్ లో కూడా వైసీపీ వాళ్లు మద్యం అమ్ముతున్నారు.అన్నీ పెంచుతూ పోతా అని చెప్పి ఛార్జీలు, ధరలు, పన్నులు, చివరకు చెత్త పన్నుకూడా వేస్తున్నాడు. త్వరలోనే నీటి పన్ను పెంచుతాడు. త్వరలో పీల్చే గాలికి కూడా పన్ను వేసే దిక్కుమాలిన పరిస్థితిలో జగన్ ప్రభుత్వం ఉంది. పక్కనున్న కర్నాటకకు, మనకు డీజిల్ పై 12రూ. తేడా ఉంది. రూ.2,200కోట్లు మహిళలకు చెందిన డబ్బులు జగన్ రెడ్డి దోచేశాడు. మరోసారి జగన్ రెడ్డి మీ వద్దకు వస్తాడు…అక్కా…చెల్లీ…అవ్వా…తాతా…అంటూ వస్తాడు. చేరదీస్తారో…తరిమికొడతారో మీ ఇష్టం.

చంద్రబాబు పాలనలోనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అమర్ రాజా బ్యాటరీ కంపెనీ మన రాష్ట్రం నుండి వెళ్లిపోవడం వల్ల రాష్ట్రంలోని 20వేల మంది యువత ఉపాధి అవకాశాలు కోల్పోయారు. పలమనేరులో నేను మాట్లాడిన బండి డీఎస్పీ పట్టుకుపోయాడు…ఈ స్టేజిని కూడా పట్టుకుపోతారేమో. యువగళం పేరు వింటే ప్రభుత్వం వెన్నులో వణుకుపుడుతోంది… ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థ దాసోహం చేస్తోంది.డమ్మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి…కలిసి కట్టుగా సైకో పాలనను గద్దె దించాలి. రాష్ట్ర భవిష్యత్తు గురించి చంద్రబాబు ఆలోచిస్తున్నారు. నిత్యావసరాల ధరలు తగ్గించి ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు తీసుకుంటారు.

 

Leave a Reply