Suryaa.co.in

Telangana

త్వరలోనే కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్దీకరణకు మార్గం సుగమం

-జూనియర్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్దీకరణ కోసం ముమ్మరంగా ప్రభుత్వ కసరత్తు
-2016 ఫిబ్రవరిలోనే కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్దీకరణ కోసం సీఎం కేసీఆర్ జీ.వో. 16 జారీ చేశారు
-కోర్టు వివాదాల వల్ల కొలిక్కిరాని క్రమబద్దీకరణ అంశం
-కోర్టు కేసు కొట్టివేతతో త్వరలోనే కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్దీకరణకు మార్గం సుగమం
– మంత్రుల నివాసంలో కిక్కిరిసిన కాంట్రాక్టు లెక్చరర్ల సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడి

జూనియర్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్దీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు. మంత్రుల నివాసంలోని క్లబ్ హౌస్ లో జూనియర్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్ల కిక్కిరిసిన సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడారు.

జూనియర్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్దీకరణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2016 ఫిబ్రవరి 26వ తేదీన జీ.వో. నంబర్ 16 ను జారీ చేశారని వినోద్ కుమార్ తెలిపారు.

కొంత మంది కోర్టును ఆశ్రయించడం వల్ల కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్దీకరణ అంశం కొలిక్కి రాకుండా పోయిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో కోర్టు కేసు కొట్టివేతతో జూనియర్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్దీకరణ ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేసిందని వినోద్ కుమార్ తెలిపారు. అయితే కింది కోర్టులో కేసు ఓడిన వ్యక్తులు సుప్రీం కోర్టును ఆశ్రయించారని ఆయన అన్నారు.

కాంట్రాక్టు లెక్చరర్ల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత సానుకూలంగా ఉన్నారని ఆయన అన్నారు. ఉద్యోగాల క్రమబద్దీకరణ విషయం కోసం పలు సూచనలు, సలహాలను కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి వినోద్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతోందని వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణను మెచ్చుకున్న కేంద్ర ప్రభుత్వం – నీతి ఆయోగ్
రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని, ఇదే విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ పలు మార్లు ప్రశంసించిందని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తుండటం, నీటి పారుదల సౌకర్యాలు పెంచడం, సంక్షేమ, అభవృద్ధి కార్యక్రమాలు భారీ ఎత్తున చేపట్టడం వంటి అనేక అంశాలు ఉన్నాయని వినోద్ కుమార్ వివరించారు.

నీళ్ళు, నిధులు, నియామకాలు ఉద్యమ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మక పాత్రను పోషిస్తున్నదని వినోద్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఒక లక్ష 30 వేల ఉద్యోగాలనుvinod భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మరో 90 వేల ఉద్యోగాల భర్తీ కోసం దశల వారీగా నోటిఫికేషన్స్ జారీ చేస్తోందని వినోద్ కుమార్ వివరించారు. ఒకేసారి నోటిఫికేషన్స్ జారీ చేస్తే అభ్యర్థులకు ఇబ్బందిగా ఉంటుందని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచం మెచ్చుకునేరీతిలో నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా పలు ప్రాజక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయని వినోద్ కుమార్ తెలిపారు.

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా లక్షలాది ఎకరాల భూములకు సాగు నీరు చేరుతుందని ఆయన అన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీనిచ్చారు. ఈ సమావేశంలో లెక్చరర్స్ సంఘాల నాయకులు రామకృష్ణ గౌడ్, జంగయ్య, రమణా రెడ్డి, సురేష్, శ్రీనివాస్, వైకుంఠం, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE