Suryaa.co.in

Andhra Pradesh

ప్రత్యేక హోదా వర్సెస్ ఈడీ అన్నది కేంద్రంలో నడుస్తోంది…

-రాజీనామాలపై నాటి జగన్మోహన్ రెడ్డి సవాళ్ళు ఏమయ్యాయి?
-ప్రత్యేక హోదా పై చిత్తశుద్ధి ఉంటే వైకాపా ఎంపీలు రాజీనామాలు చేయాలి…

-తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి, కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్…

మంగళవారం మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి, కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్, గొర్రెపాటి గోపీచంద్ నిర్వహించిన పాత్రికేయుల సమావేశం వివరాలు…

ఎంపీలు 25 మంది ఇస్తే యుద్ధం చేయొచ్చు అన్న జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా సాధిస్తాం అన్నారు, ఏమైంది మీ యుద్ధం?మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబితే అజెండాలో అంశాలు తీసేశారు అంటున్నారు. వైసీపీ ఎంపీలు అంత అసమర్ధులా, చంద్రబాబుకు ఇప్పటికీ కేంద్రాన్ని శాసించే అంత బలంగా కనిపిస్తున్నారా, ఇకనైనా వాస్తవాలు వైసీపీ ప్రజా ప్రతినిధులుమాట్లాడాలి అన్నారు.

వైసీపీకి బీజేపీకి దృఢమైన సంబంధం ఉంది కాబట్టే కేంద్రం పెట్టే ప్రతి బిల్లుకు వైసీపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అడగకుండానే మద్దతు తెలుపుతున్నారు అన్నారు.ఆనాడు జగన్మోహన్ రెడ్డి పల్లెపల్లె తిరిగి చెప్పారు, ప్రత్యేక హోదా వస్తే రాష్ట్ర పరిస్థితి మారిపోతుంది అన్నారు.వైసీపీకి151 మంది ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు కలిపి 28 మంది ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం ముందు అంతలా మెడ వంచుతున్నారు దేనికి?

ప్లీజ్ సార్… సార్ ప్లీజ్ అంటే ప్రత్యేక హోదా రాదు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యుద్ధం అంటే ఏమిటో చూపిస్తాం అన్న వ్యక్తి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్ దాటి బయటకు రావడం లేదు అన్నారు.

ప్రత్యేక హోదా పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా స్పందించాలి అన్నారు.ప్రత్యేక హోదా కోసం గతంలో ఎంపీలు రాజీనామా చేయడమే మార్గం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంశం ఇప్పుడు గుర్తుకు రాకపోవడం బాధాకరమన్నారు.అభివృద్ధి నిరోధకులుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారింది అన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతకాని తనంతో రాజధాని అమరావతిని నాశనం చేశారు, వైసీపీ పాలనలో వ్యవసాయం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది అన్నారు.

అప్పట్లోతడిసిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం కొన్న ప్రభుత్వం తెలుగుదేశం అన్నారు.నేటి వైసీపీ పాలకులుధాన్యం కొనలేరు, రైతులకు డబ్బులు ఇప్పించ లేరు అన్నారు.బస్తా కు 10-15 కేజీలు తరుగు తీస్తున్నారు. ఇదే నా రాజన్న రాజ్యం, రాజన్న పాలన అంటే.తెలుగుదేశం పార్టీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్న మాకు భయం లేదు ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది అన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఏ మాత్రం తగ్గక పోయినా, ఆర్థిక వ్యవస్థ నాశనం అవ్వడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలే కారణం అన్నారు.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ ప్రచార కార్యదర్శి, పి.వి. ఫణి కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకుడు, మోపిదేవి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE