Suryaa.co.in

Andhra Pradesh

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు నడపాలి

ఎంపీ విజయసాయి రెడ్డి

జనవరి 6: రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు అడ్డదారులు వెతుక్కుంటున్నాడని, అధికార దాహంతో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నాడని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా శనివారం పలు అంశాలు వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తన మనుషులు ద్వారా చంద్రబాబు నడిపిస్తున్నాడని, అవసరమైనప్పుడల్లా పార్టీలకు ఇం”ధనం”, ప్రత్యేక విమాన సేవలు అందిస్తున్నాడని తెలిపారు. నాడు కాంగ్రెస్ ద్వారా జగన్మోహన్ రెడ్డి పై అక్రమ కేసులు బనాయించాడని గుర్తుచేశారు.

దేశ నలుమూలల నుండి సంక్రాంతికి తెలుగువారు తమ సొంత గ్రామాలకు చేరుకుంటారని, ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ ఏపీకి ప్రత్యేక రైళ్లు నడపాలని కోరారు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబాయి వంటి మహా నగరాల నుండి స్వగ్రామాలకు చేరుకుంటారని, ప్రత్యేక రైళ్లు నడపడం ద్వారా ప్రజలు సౌకర్యం కలగడంతో పాటు రైల్వేకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందని అన్నారు.

కమిట్ మెంట్ ఉన్న నాయకుడు జగన్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కమిట్ అయ్యారంటే ఆ సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు తప్పక అందుతాయని రాష్ట్ర ప్రజలకు తెలుసని విజయసాయి రెడ్డి అన్నారు. చేతల నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ కు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అన్నారు

LEAVE A RESPONSE