Suryaa.co.in

Telangana

యువ ఆఫ్రికన్ “హార్ట్ ఫెయిల్యూర్” పేషెంట్ కు అత్యాధునిక ‘LVAD’ గుండె పరికరం

– సరికొత్త జీవితాన్నిచ్చిన యశోద హాస్పిటల్స్ వైద్యులు
– ఉగాండా అంతర్జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్ గుండెకు అత్యాధునిక LVAD – జార్విక్ 2000 సిరీస్ లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ -డివైజ్ సిస్టమ్ ను విజయవంతంగా అమర్చిన యశోద హాస్పిటల్స్

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల వైద్య చరిత్రలో ఇప్పటికే ఎన్నో అత్యాధునిక వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన యశోద హాస్పిటల్స్, ఇప్పుడు గత కొంతకాలంగా తీవ్రమైన కరోనరీ ఆర్టరీ వ్యాదితో బాధపడుతున్న ఉగాండాకు చెందిన 31సం.ల ఫుట్ బాల్ ఆటగాడు ఓక్వారా జోసెఫ్ కు యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ – డిపార్ట్‌మెంట్ ఆఫ్ కార్డియాలజీ మరియు కార్డియోథొరాసిక్ వైద్య బృందం అతని గుండె ఎడమ జఠరికకు అత్యాధునిక LVAD జార్విక్ 2000 సిరీస్, లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ సిస్టమ్‌ను అమర్చి అతనికి కొత్తజీవితాన్ని ఇచ్చారు.

yasodaఉగాండాకు చెందిన 31సం.ల ఫుట్ బాల్ ఆటగాడు ఓక్వారా జోసెఫ్, గత సంవత్సరం ఏప్రిల్ లో ఫుట్ బాల్ ఆడుతుండగా ఒక్కసారిగా ఛాతీలో, ఎడమ వైపు చేతిలో నొప్పి వచ్చింది. అతనిని దగ్గరలోని హాస్పిటల్ కి తిసువేల్లగా అక్కడి డాక్టర్లు పరీక్షించి ఇస్కీమిక్ కార్డియోమయోపతిగా నిర్ధారణ చేసారు. ఇతను చాలా కాలంగా గుండె సమస్యతో, పొత్తికడుపు వాపు, సరిగా ఊపిరి తీసుకోలేకపోవడం వంటి ఫిర్యాదులతో అక్కడి అనేక కార్పోరేట్ హాస్పిటల్లో చుపించుకున్నపటికి ఫలితం లేకపోవడంతో ఓక్వారా జోసెఫ్, గత సంవత్సరం నవంబర్‌లో మెరుగైన వైద్యం కోసం భారతదేశానికి వచ్చారు.

తమ వద్దకు వచ్చిన ఓక్వారా జోసెఫ్ కి పరీక్షలు నిర్విహంచిన మా యశోద హాస్పిటల్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కార్డియాలజీ మరియు కార్డియోథొరాసిక్ వైద్యనిపుణులు అతను తీవ్రమైన కరోనరీ ఆర్టరీ వ్యాదితో బదపడుతునట్లు దానివల్ల అతని శరీరబాగాలకు రక్తాన్ని పంప్ చేసే గుండె ఎడమ జఠరిక సిస్టోలిక్ పనిచేయకపోవడం అనేది గుండెపోటుకు దారితీసే ఒక స్థితి. ఇది గుండె వైఫల్యం యొక్క లక్షణాలను తెలియజేస్తుంది అని గుర్తించి. యశోద హాస్పిటల్స్ – డిపార్ట్‌మెంట్ ఆఫ్ కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ అండ్ హార్ట్ – లంగ్ మెకానికల్ అసిస్టెడ్ డివైస్ టీమ్ దీనికి జార్విక్ 2000 లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ సిస్టమ్ అమరచ్చడమే సరియైన పరిష్కారమని గుర్తించి. గత సంవత్సరం డిసెంబర్ 24న విజయవంతంగా ఓక్వారా జోసెఫ్ కు అత్యాధునిక LVAD (JARVIK 2000 SERIES) అమర్చడం జరిగింది.

ఇది గుండె మార్పిడికి వంతెనగా లేదా దీర్ఘకాలిక గుండె వైఫల్యం ఉన్న రోగులకు డెస్టినేషన్ థెరపీగా ఉపయోగపడుతుందని యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ – డిపార్ట్‌మెంట్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ &
yasoda2 ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, డాక్టర్. వి. రాజశేఖర్ మరియు కార్డియో-థొరాసిక్, హార్ట్ & లంగ్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ వైద్యులు తెలిపారు.

ఈ సందర్బంగా యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్. పవన్ గోరుకంటి, మాట్లాడుతూ.. మన శరీరంలో అత్యంత కీలకమైన, అవిశ్రాంతంగా పనిచేసే అవయవం గుండె. గుండె పూర్తిగా కండరాలతో నిర్మితమైన అవయవం. అది నిరంతరాయంగా ప్రతిస్పందిస్తుండటంతో ఆరోగ్యంగా ఉండటానికి నిదర్శనం. అయితే కొన్ని రకాల వ్యాధుల కారణంగా దెబ్బదిన్న గుండె కొట్టుకోవటంలో విపరీతమైన నెమ్మదితనం వచ్చి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. గుండె పనిచేయడం మానేస్తే క్రమంగా హార్ట్
ఫెయిల్యూర్ కి దారితీస్తుంది. మనదేశంలో 3 కోట్ల మందికి పైగా హృద్రోగులుండగా వారిలో దాదాపు 45 లక్షల మంది పేషెంట్ల గుండె వైఫల్యం చెందివుందని నివేదికలు చెప్తున్నాయి. హార్ట్ ఫెయిల్యూర్ కి చివరి ప్రత్యామ్నాయం గుండెమార్పిడే. అయితే దాత నుంచి గుండె దొరికే వరకు ఫెయిలైన గుండె స్థానంలో పనిచేయడానికి కూడా ఇప్పుడు సరికొత్త పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి పరికరమే వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్. సరిగ్గ ఇలాంటి గుండె సమస్య (కరోనరీ ఆర్టరీ వ్యాది)తో ఉగాండాకు చెందిన 31సం.ల ఫుట్ బాల్ ఆటగాడు ఓక్వారా జోసెఫ్ మా హాస్పిటల్ కి డిసెంబర్ 13, 2021న రావడం జరిగింది.

ఇలాంటి పేషంట్లకు చివరి దశలో ప్రాణాలు నిలపడానికి చేసే సర్జరీ లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్. (ఎల్ వి ఎ డి) అనే పరికరాన్ని అమర్చడం. మెకానికల్ అసిస్ట్ పరికరాల్లో జార్విక్ 2000 సిరీస్, అనేది ఆధునికమైనది. అనారోగ్యంతో ఉన్న గుండెను తాత్కాలికంగా ప్రాణాపాయం నుంచి రక్షించడానికి (ఎల్ వి ఎ డి) సహాయపడుతుంది. దీన్ని అమర్చిన తరువాత కొన్నాళ్లకు గుండె కోలుకోవచ్చు. లేదా సరైన దాత దొరకగానే గుండె మార్పిడి చేయవచ్చు. గుండెమార్పిడి కోసం గుండె దొరికేవరకు ఇది సపోర్టుగా ఉంటుంది.

విఎడిల డిజైన్లో చాలా రకాల సాంకేతిక మార్పులు వచ్చాయి. కాబట్టి ఎక్కువ మంది పేషెంట్లు, ఎక్కువ కాలం దీన్ని అమర్చుకోగలుగుతున్నారు. తద్వారా జీవితకాలం మెరుగుపడుతున్నది. కాంప్లికేషన్లు కూడా తగ్గుతున్నాయి అని యశోద హాస్పిటల్స్, డైరెక్టర్ డాక్టర్. పవన్ గోరుకంటి తెలియజేసారు.

LEAVE A RESPONSE