Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం

-ప్లెక్సీలు చించేస్తుంటే పోలీసులు ఏం గాడిదలు కాస్తున్నారా?
-పెద్దిరెడ్డీ నీ పని, వైసీపీ పని అయిపోయింది
-మమ్మల్ని బాధపెట్టిన వాళ్లను వదిలిపెట్టం.
-పీలేరు సబ్ జైలులో ఉన్న పుంగనూరు టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఏమన్నారంటే..
పుంగనూరు నియోజకవర్గం లో కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారు.ఏడుగురు మైనారిటీ సోదరులపై కేసులు పెట్టారు. అయ్యప్ప భక్తుడిపైనా కేసు పెట్టి జైల్లో పెట్టారు.21 ఏళ్లు ఉన్న ఇంటర్మీడియట్ చదువుతున్న పఠాన్ రియాజ్ ఖాన్ అనే యువకుడిపై కేసు పెట్టారు.ఏ కారణాలూ లేకుండా ఎఫ్ఐఆర్ లో ఇతరులు అని చేర్చి 8 మందిని అక్రమంగా అరెస్టు చేశారు. అరెస్టు చేసిందే కాక స్టేషన్ కు తీసుకొచ్చి వారి ని హింసించారు.

ఎంపీ రఘురామరాజును కొట్టినట్లుగా ఇక్కడి సీఐ, ఎస్ఐ అరెస్ట్ చేసిన వారిపై నీచంగా కొట్టి, భయపెట్టి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. మెజిస్ట్రేట్ వద్ద కొట్టినట్లు చెప్తే కాల్చేస్తాం, కేసులు పెట్టి తిప్పుతాం అని బెదిరించారు.దీనకంటే ఉగ్రవాద చర్య మరొకటి ఉంటుందా.? పోలీసులకు ఎవరిచ్చారు ఈ హక్కు? ఖాకీ బట్టులు వేసుకున్న వాళ్లు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వీళ్లందరినీ వదిలిపెట్టే ప్రసక్తేpeeleru2 లేదు.మైనారిటీలను అరెస్టు చేసిందేకాక..ఇతరుల పేర్లు చెప్పాలని టార్చర్ పెట్టారు.రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోంది. పోలీసులు చట్టాన్ని గుర్తుంచుకోవాలి. ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతారు.? ఖబడ్దార్ గుర్తుంచుకోవాలి. అందరినీ సమానంగా చూడాలి. కొందరు చట్టానికి చుట్టాలు కాదు. చల్లా బాబు జన్మదినం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ప్లెక్సీలు కట్టారు. వైసీపీ దొంగలు వచ్చి ప్లెక్సీలను చించేశారు. ప్లెక్సీలు చించేస్తుంటే పోలీసులు ఏం గాడిదలు కాస్తున్నారా.?మేము వైసీపీ ప్లెక్సీలు చించితే పోలీసులు మమ్మల్ని వదిలిపెడతారా.?

వైసీపీ వాళ్లే పెక్సీలు చించి వాళ్లే కేసులు పెట్టారు. ఎందుకు ఏకపక్షంగా వ్యవహిరించారని అడిగిన పాపానికి మా కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. ఉయ్యాల జ్యోతి, ఉయ్యాల కిషోర్, నాగార్జున నాయుడు, అక్రమ్ తీవ్రంగా గాయపడ్డారు.రొంపిచర్ల ఎస్ఐ సహకారంతో 145, 147, 307, 324 వంటి రకరకాల ఐపీసీ సెక్షన్ల కింద 11 మందిపై కేసులు పెట్టారు.రాష్ట్రంలో ఎవరూ పర్యటించకూడదా.? గతంలో రాజశేఖర్ రెడ్డి, విజయమ్మ, షర్మిళ కూడా తిరిగారు. జగన్ రెడ్డి కూడా పాదయాత్రలు చేశాడు. కానీ నేను ఎప్పుడూ..ఎక్కడా అడ్డంకులు సృష్టించలేదు.

తప్పుడు కేసులు పెడుతున్నారు. మైనారిటీ సోదరులకు పిలపునిస్తున్నా. ఇప్పటికే 50 మందికి పైగా ముస్లిం సోదరులపై దాడులు చేశారు.నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం పోలీసుల వేధింపులు తాళలేక రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుంది.ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారు..ప్రతిఘటిస్తేpeelru చంపేస్తున్నారు. పండగపూట చెప్తున్నా..నా కార్యకర్తలను పండగపూట జైల్లో పెట్టావు పెద్దిరెడ్డి. నేను కూడా ఈ రోజు పండగ జరుపుకోకుండా జైలు వద్దకు వచ్చా. ప్రజలు కూడా పండగ నాడు జైలు వద్దకు వచ్చారు. పెద్దిరెడ్డీ నీ పని, వైసీపీ పని అయిపోయింది. అందుకే సైకో పోవాలి..సైకిల్ రావాలి అనేది ఇంటింటి నినాదం అయింది.తప్పుడు కేసులు పెట్టి, రాక్షసానందం పొందడం సైకోలు తప్ప మరెవరైనా చేస్తారా? వేరే రాష్ట్రాల నుండి మద్యం తెచ్చి దొంగ వ్యాపారం చేసే వాళ్లను జైల్లో పెట్టాలి.

మమ్మల్ని బాధపెట్టిన వాళ్లను వదిలిపెట్టం. నూటికి 95 శాతం మంది పోలీసులు మంచివాళ్లు ఉన్నారు. కానీ కొందరు పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రొంపిచర్ల ఎస్ఐ. కల్లూరు సీఐ ఎలా తప్పించుకుంటారో చూస్తా. మీ ఇష్ట ప్రకారం కొట్టి తిడతారా? అమ్మ, అక్క అని తిడతారా.? నేను కూడా బూతులు మాట్లాడితే ప్రజలు మీ మొహాన ఉమ్ముతారు. పోలీసుల ఆటలు సాగుతున్నాయని తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు.రాష్ట్రంలో మైనార్టీలకు మనుగడ లేదు. నన్ను పీలేరు రాకుండ అడ్డుకుంటారా? – నేను ఎక్కడికి వస్తే అక్కడ పోలీసు యాక్టు 30 పెడతారా? చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించి.. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదిలిపెట్టం.

LEAVE A RESPONSE