నా నీడగా నిలిచిపో

0
100

కొంత కష్టం
కొంచెం సుఖం
తెలుసు ఏదీ శాశ్వతం కాదని…

అయినా ….
అనునిత్యం
నీ తలపుల ప్రేమ పుష్పాలు ఆఘ్రాణిస్తుంటే
ఏదో తెలియని ఆరాటంతో
కనురెప్పల వాలిన వేదన
నిద్రను దూరం చేస్తుంది…!!

కొంత సంతోషం
కొంత దుఃఖం
తెలుసు ఈ క్షణం కరిగిపోతుందని…

అయినా…
నా జీవన పయనపు
మలుపులన్నింటిలో…
నీ మధుర స్మృతులు
దిశా నిర్దేశకం చేస్తుంటే
ఏదో తెలియని మొహమాటంతో కనురెప్పల సందుల్లోంచి
కాలం కన్నీటి చుక్కగా
రాలిపోతుంది..!!

మమతల మల్లెల మనస్సాక్షిగా
మహారాజుగా
మనసును ఏలుకో….!!

నింగి నేల సాక్షిగా
ఆజన్మంతం
నా నీడగా నిలిచిపో…!!

నలిగల రాధికా రత్న