Suryaa.co.in

Andhra Pradesh

హెలికాప్టర్‌లను అద్దెకు తీసుకోవడాన్ని నిలుపుదల చేయండి

– రూ.3.84 కోట్లు ఖర్చు ప్రజాధనం వృధా చేస్తారా?
– పార్టీ ప్రచారం కోసం ప్రజాధనం దుర్వినియోగం చేయడం దుర్మార్గం
– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న లేఖ

సి.ఎం జగన్ ఎన్నికల ప్రచారం కోసం రెండు హెలికాప్టర్‌లను అద్దెకు తీసుకోవడాన్ని నిలుపుదల చేయండి. ఒక్కో హెలీకాప్టర్‌కు నెలకు రూ.1.92 కోట్లు చొప్పున రెండింటికి రూ.3.84 కోట్లు ఖర్చు ప్రజాధనం వృధా చేస్తారా? 2024 సాధారణ ఎన్నికల్లో జగన్ రెడ్డి తన పార్టీ ప్రచారం కోసం ప్రజాధనం దుర్వినియోగం చేయడం దుర్మార్గం.

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుంది. ఎన్నికల నియమావళిని అధికారంలో ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వం నిబద్దతతో అమలు పరచాలి. ఎన్నికల నియమావళి ప్రకారం పార్టీ ప్రచారం కోసం ఎయిర్ క్రాప్ట్‌లతో సహా ప్రభుత్వ వాహనాలు వాడరాదు. ఇటువంటి నేపధ్యంలో రెండు హెలీకాప్టర్‌లను అద్దెకు తీసుకోవాలని జీవోలు జారీచేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

హెలీకాప్టర్‌లు అద్దెకు తీసుకోవడం రాజకీయ లబ్దికోసం తప్ప మరోటి కాదు. ఎన్నికల నోటిఫికేషన్ కొన్ని వారాల్లో వస్తున్న నేపధ్యంలో ఈ నిర్ణయం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, జీపీఎఫ్, మెడికల్ బిల్లులు చెల్లించలేని ప్రభుత్వం కాప్టర్లను అద్దెకు తీసుకోవడం ప్రజాభీష్టానికి వ్యతిరేకం. కావున, కాప్టర్లను అద్దెకు తీసుకోలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిలుపుదల చేయండి.

 

LEAVE A RESPONSE