Suryaa.co.in

Andhra Pradesh

ఆర్కే బీచ్ లో రెండో రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి

పర్యాటకులకు తప్పిన పెను ప్రమాదం…
సముద్రం లోకి 100 మీటర్లు దూరం కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి
చివరి ఫ్లాట్ ఫామ్ భాగం
అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం
ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడంతో ఎక్కాలంటే భయబ్రాంతులకు గురవుతున్న పర్యాటకులు
నిన్న అట్టహాసంగా ఆర్కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రులు అమరనాథ్
విశాఖపట్నం లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోలేదు
సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం అవాస్తవం.
మెట్రోపాలిటన్ కమిషనర్

విశాఖపట్నం : ఫ్లోటింగ్ బ్రిడ్జి పైకి వాస్తవంగా 26.02.2024 తే.ది నుండి సందర్శకులను అనుమతించాలని భావించినప్పటికీ, వాతావరణములో మార్పుల రీత్యా సముద్ర ప్రవాహాలు తీవ్రంగా ఉండటం వలన నేడు సందర్శకులను ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైకి అనుమతించ లేదు మరియు సముద్ర ప్రవాహాల తీవ్రత రీత్యా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్వాహకులు “T” పాయింట్ (వ్యూ పాయింట్) ను బ్రిడ్జ్ నుంచి విడదీసి దాని పటిష్టత ను పరిశీలించే నిమిత్తము, ఏంకర్ (anchor) లకు దగ్గరగా జరిపి నిలిపి వుంచడం జరిగినది.

ఆ విధంగా బ్రిడ్జ్ మరియు “వ్యూ పాయింట్” ల మద్య ఏర్పడిన ఖాళీ ప్రాంతాన్ని ఫోటో తీసి “ఫ్లోటింగ్ బ్రిడ్జ్” తెగిపోయిందన్న వార్త సోషల్ మీడియా లో ప్రచారం చేయుచున్నారని గుర్తించడమైనది. ఇది పూర్తిగా దుష్ప్రచారం మరియు అవాస్తవం. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నుండి దాని “T” జంక్షన్ వ్యూ పాయింట్ ను సాధారణ మాక్ డ్రిల్ల్స్ లో భాగంగా మాత్రమే విడదీసి వేరు చేయడమయినది, సముద్ర ప్రవాహాలు తీవ్రంగా (హై టైడ్) ఉన్నప్పుడు ఇది సాదారణంగా చేపట్టే సాంకేతిక పరిశీలనలో భాగమని, భవిష్యత్తులో కూడా అవసరమైన సంధర్భాలలో ఇటువంటి మాక్ డ్రిల్ల్స్ ను చేపట్టడం జరుగుతుందని తెలియజేయడమైనది.

 

LEAVE A RESPONSE