సర్కారుకు అంగన్వాడీల వింత నిరసన

-చెవులు పట్టుకున్నారు.. గుంజీలు తీశారు

నందిగామ: రాష్ట్ర ప్రభుత్వానికి గుంజీలు తీస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె. గోపాల్ మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 28 రోజులు పాటు సమ్మె చేస్తు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెను విచ్చిన్నం చేయటానికి చూస్తుంది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం చాలా దుర్మార్గం. తక్షణమే ఎస్మా చట్టాన్ని రద్దుచేసి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలియజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో కొల్లి సరళ ,సుజాత, వెంకట్రావమ్మ, పిచ్చిమ్మ, వనిత , మహాలక్ష్మి,వేణు, లక్ష్మీ ,రాణి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply