Suryaa.co.in

Andhra Pradesh

విద్యార్ధులకు జగన్ రెడ్డి చేస్తున్న మోసంపై అవగాహన కల్పిస్తాం

– టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మానం ప్రణవ్ గోపాల్

నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. విద్యార్ధులకు జరిగిన అన్యాయంపై వారిలో ఛైతన్యం కలిగిస్తామని తెలుగునాడు విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షులు మానం ప్రణవ్ గోపాల్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంటరీ అధ్యక్షులు కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. నవంబర్ 18న విద్యార్ధి మేలుకో భవిష్యత్ కాపాడుకో కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేసి నవంబర్ 22 నుండి డిసెంబర్ 22 వరకు నెల రోజుల పాటు విద్యార్ధులకు జగన్ రెడ్డి చేసిన మోసంపై వివిధ రూపాల్లో అవగాహన కల్పిస్తామన్నారు. అదే విధంగా జగన్ రెడ్డి విద్యార్ధులకు ఇచ్చిన హమీల అమలులో జరిగిన అన్యాయంపై ఛైతన్యం తెస్తామన్నారు.

పాఠశాలలను ప్రయోగశాలగా మార్చి విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్నారు. నాణ్యమైన విద్యను దూరం చేశారు. విశ్వవిద్యాలయాలను వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారు. మనబడి నాడు నేడు, విద్యాకానుక, బైజూస్ వంటి పథకాలను అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారు. పీజీ విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ ను రద్దుచేశారు. విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ను నిర్వీర్యం చేశారు. ఇటువంటి పథకాలను పట్టించుకోకపోవడం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్ధులకు విద్యను దూరం చేశారు.

విద్యార్ధి లోకానికి జగన్ రెడ్డి చేసిన మోసాలపై డిసెంబర్ 07న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తామన్నారు. అంతే కాకుండా అనేక అవగాహన ర్యాలీలు, సదస్సులు, సమావేశాలు నిర్వహించి విద్యార్ధులందరిని ఏకతాటిపై తెస్తామన్నారు. ప్రత్యేకహోదా అంటూ విద్యార్ధులను రెచ్చగొట్టి తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పి మాడమ తిప్పారు. రాబోయే రోజుల్లో అదే విధ్యార్దులను జగన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయమన్నారు.

LEAVE A RESPONSE