Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ ఉక్కు ప్రైవేటుకరణ ఆలోచన విరమించుకోవాలి

– వెయ్యి రోజుల పోరాటానికి అభినందనలు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలి
– కేంద్రం రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేసిందో పురంధరేశ్వరి చెప్పాలి
– పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయాలి
– సీపీఐ రాష్ట్రకార్యదర్శి కే రామకృష్ణ

కర్నూలు : విశాఖ ఉక్కుప్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన కేంద్రప్రభుత్వం విరమించుకోవాలని, ఉక్కుప్యాక్టరీ కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా 1000 రోజులు ఆందోళన చేయడం చరిత్రాత్మకమైన విషయమని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఈ పోరాటం ఆదర్శమని, వారిని అభినందిస్తున్నట్లు సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట గాంధీ విగ్రహం వద్ద విద్యార్థి యువజన సంఘాల ఆద్వర్యంలో చేపట్టిన బంద్కు సంఘీభావంగా సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నా కార్యాక్రమానికి సీపీఐ నగర కార్యదర్శి పీ రామకృష్ణారెడ్డి అద్యక్షత వహించారు. ఈ ధర్నా నుద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంద్ర హక్కు అనే నినాదంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్లో విద్యార్థి, యువజన సంఘాలు ఎర్రజెండా అండతో నాడు పోరాటాలు చేసి సాధించుకోవడం జరి గి ందన్నారు. సుమారు 32 మంది అసువులు బాశారని, వామపక్షపార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామ చేసి ఆందోళనకు మద్దతు ఇవ్వడంతో ఉక్కుప్యాక్టరీ సాధించడం జరిగి ందన్నారు.

నేడు బీజేపీ ప్రభుత్వం దీనిని ప్రైవేటీకరణ చేయాలని, ఆదాని, అంబానీలకు దోచి పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని హెచ్చరించారు. కడపలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉక్కుప్యాక్టరీకి శంఖుస్థాపన చేశారని, తరువాత చంద్రబాబునాయుడు కూడా శంఖుస్థాపన చేశారన్నారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రెండుసార్లు శంఖుస్థాపన చేశారు కాని | పనులు ప్రారంభించలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థియువజన సంఘాలు చేపట్టిన విద్యాసంస్థల బంద్కు సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నామన్నారు.

కేంద్రం రాష్ట్రంను ఏమి అభివృద్ధి చేసిందో పురందీశ్వరీ చెప్పాలి… అభివృద్ధి అంతా కేంద్రప్రభుత్వం సహకారంతో చేస్తుందని బీజేపీ రాష్ట్ర అద్యక్షురాలు పురందీశ్వరీ చెప్పడంపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమి చేశారో చెప్పాలన్నారు. ఒక్కరోడ్డు వేశారా, ఒక్క ప్రాజెక్టు కట్టారా, ఒక్క యూనివర్శిటీ కట్టారా చెప్పాలన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినా నిధులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. పార్లమెంట్ సాక్షిగా విభజన సమయంలో ఇచ్చిన హామీలు ముఖ్యంగా ప్రత్యేక హెూదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి అతిగతి లేదన్నారు.

పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని కావాలని తెలంగాణాలో చెప్పారని ఎందుకు మోడీ ప్రధాని కావాలో చెప్పాలన్నారు. 1000 పోరాటానికి అభినందలని, ఉభయ కమ్యూనిస్టుపార్టీలు, విద్యార్థి యువజన సంఘాల వారికి అభినందనలు తెలియచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, సహాయ కార్యదర్శులు ఎస్ ఎన్ రసూల్, ఎస్ మునెప్ప, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఎన్ లెనిన్బాబు, సీపీఐఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, ఏఐటీయూసీ రాష్ట్రనాయకులు లలితమ్మ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

LEAVE A RESPONSE