సారా వీర్రాజు గారూ.. ఇంకా ఎక్కువమంది తాళి తెంపుతారా?

Spread the love

– సోది వీర్రాజులా మాట్లాడుతున్నారు: సుంకర పద్మశ్రీ
– బీజేపీ లిక్కర్ వ్యాఖ్యలపై విజయవాడలో మహిళల నిరసన

మేం అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ 50 రూపాయలకే ఇచ్చి మహిళల తాళిబొట్లను ఇంకా ఎక్కువ తెంపుతానంటున్న బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తక్షణం మహిళలకు క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఆ మేరకు విజయవాడలో జరిగిన నిరసన కార్యక్రమానికి వివిధ సంఘాలు, పార్టీల మహిళా నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ సోము వీర్రాజు సోది మాటలు ఆపి, ముందు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కేంద్రంపై పోరాడాలని సవాల్ చేశారు. రెండున్నరేళ్ల నుంచి జగన్ సర్కారు మద్యం దోపిడీ చేస్తుంటే అడ్డుకునే దమ్ములేది దద్దమ్మ సోము

వీర్రాజు, సోది వీర్రాజులా మారారని ఎద్దేవా చేశారు. ఒక్క సీటుకే గతి లేకపోయినా అధికారంలోకి వస్తానంటున్న సోము వీర్రాజు ఈ రాష్ట్రంలో పెద్ద పొలిటికల్ జోకర్‌గా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కోతికి కొబ్బచిప్ప ఇచ్చినట్లు వీర్రాజుకు అధ్యక్ష పదవి ఇస్తే, కల్లుతాగిన కోతిలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చీప్‌లిక్కర్ ధరలు తగ్గిస్తామనడం పేదల తాళిబొట్లను మరింత తెంచడమేనని పద్మశ్రీ స్పష్టం చేశారు.

వీర్రాజు కోడిగుడ్ల కథ త్వరలో చెబుతా: పద్మశ్రీ
సోము వీర్రాజు పదేపదే కోడిగుడ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారో తాను త్వరలో వెల్లడిస్తానని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ చెప్పారు. కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో ఏమేమి
liq-vja మంతనాలు జరిగాయో తనకు సమాచారం ఉందన్నారు. అదేవిధంగా చీమకుర్తిలో డంపింగ్, ధవళేశ్వరంలో శాండ్ రీచ్ కథ కూడా తేల్చి బీజేపీ నిజాయితీని బయటపెడతానని చెప్పారు.

Leave a Reply