-కౌంటింగ్ సెంటర్లోకి వెళ్ళవద్దని ఆదేశం
-హైకోర్టు పిన్నెల్లికి ఇచ్చిన రక్షణ న్యాయాన్ని అవహేళన చేయడమేనని వ్యాఖ్య
-ఈవీఎం బద్దలు కొట్టిన వీడియోను జడ్జికి చూపిన న్యాయవాది ఆదినారాయణ రావు
-దీనికేమంటారని ఎమ్మెల్యే న్యాయవాని ప్రశ్నించిన సుప్రీంకోర్టు జడ్జి
-నీళ్లు నమిలిన పిన్నెల్లి న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు జడ్జి
-నీళ్లు నమిలిన పిన్నెల్లి న్యాయవాది
ఈవీఎంను బద్దలు కొట్టి ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణ రెడ్డి కి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఇచ్చిన రక్షణ పైన నంబూరి శంకర రావు దాఖలు చేసిన ఎస్ ల్ పి పైన ఈ రోజు సుప్రీం కోర్టులో జస్టిస్ అరవింద్ కుమార్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తప్పు పట్టింది. ఇది న్యాయాన్ని అవహేళన చెయ్యటమే అని మండి పడింది.
సీనియర్ న్యాయవాది ఆదినారాయణ మరియు జవ్వాజి శరత్ లు వాదిస్తూ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన వెబ్ కాస్టింగ్ వీడియో ల ను ధర్మాసనానికి ప్రదర్శించారు. అది చూసి రామకృష్ణా రెడ్డి కి సంభందించిన న్యాయవాదిని దీనికి ఏమి సమాధానం చెప్పగలవు అని అన్నారు. దాని గురించి తానేమీ అన దలుచుకోలేదు అని అన్న తరువాత కోర్టు జడ్జిమెంట్ పాస్ చేసింది.
పిన్నేలి రామకృష్ణా రెడ్డి కౌంటింగ్ కి సంబంధించిన పరిసరాల లోకి రాకూడదు అని, ఆవిధంగా ఒప్పుకుంటున్నట్టు అఫిడవిట్ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు పాస్ చేసింది.. తదుపరి విచారణలో అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొని మాత్రమే హైకోర్టు తగు ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొంది.