శ్రీకాకుళం : జిల్లా కలెక్టరేట్ ట్రెజరీ విభాగంలో గార్డుగా పని చేస్తున్న కానిస్టేబుల్ సవర జోక్యో (55) సోమవారం మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా మృతి చెందడంతో ఎస్.ఐ హరికృష్ణ ఈయన మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.విధి నిర్వహణ లో మృతి చెందడం వెనుక మరేదైనా కోణం ఉందేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఎస్సై హరికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.