– సుబ్బారావు వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేకున్నాడని చెప్పడం నీచం
– వైకాకా దుర్మార్గాలతో విఘత జీవిగా మారిన సుబ్బారావే ఆయ భార్య, కుమార్తెను చంపాడని చెప్పడం నీచం
– పవిత్ర రంజాన్ మాసంలో అబద్దాలు ఆడుతున్న కడప డీఎస్పీ షరీఫ్ ను ఆ అల్లా కూడా క్షమించడు
-టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ
వైఎస్సార్ జిల్లా, ఒంటిమిట్ట మండలం, కొత్త మాధవరానికి చెందిన చేనేత కార్మికుడు పాలా సుబ్బారావుతో పాటు భార్య, కుమార్తె బలవన్మారణాలకు కారణమవడమే కాక వారి ఆత్మలు సైతం క్షోభించేలా కడప డీఎస్పీ షరీఫ్ వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ఆవేధన వ్యక్తం చేశారు.
సుబ్బారావు కుటుంబం వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేకున్నారని, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు, వైకాపాకు చెందిన కట్టా శ్రావణి పేరుతో భూ బదలాయింపులు 2017 లోనే జరిగిందంటూ అబద్దాలు వల్లెవేశాడు. అంతేకాకుండా సుబ్బారావుకు క్రికెట్ బెట్టింగులు, చెడు అలవాట్లు, మద్యానికి బానిసయ్యాడంటూ మాట్లాడి ఆయన ఆత్మ క్షోభించేలా పత్రికా సమావేశంలో మాట్లాడాడు. పవిత్ర రంజాన్ మాసంలో ఏ ముస్లిం కూడా అబద్దమాడరు.
అలాంటి పవిత్రమైన మాసంలో ఒక ముస్లిం అయి ఉండి జగన్ రెడ్డి మెప్పుకోసం తనువు చాలించిన ఒక పేద చేనేత కార్మికుడిని, ఆయన కుటుంబాన్ని పత్రికా ముఖంగా నిర్ధాక్షిణ్యంగా అవమానించడం అత్యంత నీచం, దుర్మార్గం. కడప డీఎస్పీ షరిఫ్‌ను ఆ అల్లా కూడా క్షమించడు. షరీఫ్ చెప్పినట్లు సుబ్బారావు కుటుంబానికి చెందిన మూడెకరాల భూమి 2017 లోనే కట్టా శ్రావణి పేరుపైకి మారి ఉంటే..2021 డిసెంబర్ లో సుబ్బారావుకు సదరు భూమికి సంబంధించి పి.ఎం కిసాన్ డబ్బులు ఆయన ఖాతాలో ఎలా పడ్డాయో షరిఫ్ చెప్పగలడా?
కొత్త మాధవరంలో ఎంతో గౌరవంగా బ్రతికిన సబ్బారావే తన భార్యను, కుమార్తెను చంపి తరువాత ఆత్మహత్య చేసుకున్నాడని ఇస్లాంకు చెందిన కడప డీఎస్పీ చెప్పడం సిగ్గుచేటు. జగన్ రెడ్డి ప్రజల భూములు దోచుకోవడానికి కొత్త భూ హక్కు చట్టం తీసుకొచ్చి పాత తేదీలతో ప్రజల స్థిరాస్తులను వైసీపీ వారికి దోచుపెడుతున్నాడు. ఇంతటి దారుణాలకు ఒడిగడుతున్న జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్‌కు రాబోయే ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ తప్పుడు చట్టాన్ని రద్దు చేసి ప్రజల ప్రాణలకు, ఆస్తులకు రక్షణం కల్పిస్తాం.