టీడీపీ తీర్ధం పుచ్చుకోబోతున్న తాడిశెట్టి సోదరులు

ఇటీవలే వైసీపీకి గుడ్‌బై చెప్పిన తాడిశెట్టి మురళి, తాడిశెట్టి సోదరులు తదుపరి కార్యాచరణ త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించారు. అయితే తాడిశెట్టి మురళి జనసేనలో చేరుతారా లేదా టీడీపీలో చేరుతారా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఒక ప్రముఖ ఛానల్‌లో వారు జనసేనలో చేరుతారనే వార్తలు వచ్చాయి. వాటికి తెరదింపుతూ ఇప్పుడు తాడిశెట్టి సోదరులు టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. బుధవారం మధ్యాహ్నం టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనే యులు, తాడిశెట్టి మురళి ఇంట్లో విందులో పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ టీడీపీలో వారికి సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇవ్వడంతో తాడిశెట్టి సోదరులు ఈ నెల 5వ తేదీన భారీ ర్యాలీతో టీడీపీలో చేరబోతున్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రవర్మ, జనసేన ప్రత్తిపాడు అధ్యక్షుడు గడ్డం నాగేశ్వరావు పాల్గొన్నారు.

Leave a Reply