Suryaa.co.in

Andhra Pradesh

అవినీతి, అరాచకలతో రాష్ట్ర ప్రభుత్వం మునిగిపోయింది

-కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్‌ వల్లూరు జయప్రకాష్‌ నారాయణ

కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు అంటించుకుని ప్రచారం చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్‌ వల్లూరు జయప్రకాష్‌ నారాయణ విమర్శించారు. గుంటూరు జేకేసీ కాలేజ్‌ రోడ్డులోని మౌర్య ఫంక్షన్‌ హాలులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన ఇళ్ల నిర్మాణాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదు. అవినీతి, అరాచకంలో ప్రభుత్వం మునిగిపోయిందని విమర్శించారు.

మోదీ కొత్త విశ్వ విద్యాలయాలు, ఎయిమ్స్‌, ఎయిర్‌ పోర్టులు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. 23000 వేల కోట్ల రూపాయలను కేంద్రం సంక్షేమ పథకాలు ద్వారా అందించిం దన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్నో పథకాలకు జగన్‌ స్టిక్కర్లు అంటించు కుంటున్నారు. వృద్ధులకు పంచే పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుం దని విమర్శించారు. సచివాలయ సిబ్బందితో వృద్దులు, వికలాంగులకు ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం గోతుల మరమ్మతులు కూడా చేయటం లేదు. ఈ సమావేశంలో పాలపాటి రవికుమార్‌, ఆవుల రామకోటేశ్వర రావు, కొక్కెర శ్రీనివాస్‌, మంత్రి సుగుణ, కోలా రేణుకాదేవి, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు..

LEAVE A RESPONSE