Suryaa.co.in

Features

మోడీ ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకోండి

మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాధారణ కుటుంబాలకు భద్రత ఉండాలనే సంకల్పంతో రెండు ఇన్సూరెన్స్ పథకాలను అతి తక్కువ ప్రీమియంతో ప్రవేశపెట్టారు.

ఆ ఇన్సూరెన్స్ స్కీములనుఇప్పటికే చేసుకున్న వారు కొంతమంది ఉన్నప్పటికీ, ఈ దేశంలో ఇంకా చేసుకోవాల్సిన వారు కోట్లలో ఉన్నారు. ఆ స్కీమ్ వివరములు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను

1. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ఈ ఇన్సూరెన్స్ పథకానికి 18 నుండి50 సంవత్సరంలో వయసు కలిగిన ప్రతి ఒక్కరూ అర్హులే. ఇందుకు సంవత్సరానికి ₹350 రూపాయలు బ్యాంకులో మీ అకౌంట్లో కట్టాలి. ఈ పథకం వల్ల ఈ స్కీములో కట్టిన మనిషి సాధారణంగా చనిపోతే ₹2 లక్షల రూపాయలు ఆ కుటుంబ సభ్యులకు 15 రోజుల్లో ఇన్సూరెన్స్ కంపెనీ, బ్యాంకు ద్వారా చెల్లిస్తుంది.
2. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఈ పథకానికి 18 నుండి70 సంవత్సరములు వయసు వారు అర్హులు. వీరు బ్యాంకు అకౌంట్ ద్వారా సంవత్సరానికి ₹20 చెల్లిస్తే, ఆ వ్యక్తి యాక్సిడెంట్లో మరణిస్తే,ఆ కుటుంబ సభ్యులకు ₹2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ బ్యాంకు ద్వారా కుటుంబ సభ్యులకు చెల్లిస్తుంది.

ఈ పథకములో చేరాలంటే మీకు బ్యాంకులో ఉన్నసేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ద్వారా అప్లికేషన్ల పైన సంతకం చేస్తే ఆటోమేటిగ్గా ప్రతి సంవత్సరం బ్యాంకు వారు చేసుకుంటారు . ప్రతి సంవత్సరము మే 25వ తారీకు కు మీ అకౌంట్లో ₹370 రూపాయలు ఉంటే మీరు రెండు స్కీములలో చేరవచ్చును. కానీ ఒక్కసారి మీరు బ్యాంకుకు వెళ్లి నేను ఈ రెండు ఇన్సూరెన్స్ పథకాల్లో చేర దల్చుకున్నాను అని బ్యాంకు దగ్గర ఉన్న అప్లికేషన్లను పూర్తి చేసి వారు అడిగిన వివరములు అన్ని ఇవ్వవలెను. మిగతా పని అంతా బ్యాంకు వారు చేసుకుంటారు.

ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని మోడీ గారి ప్రవేశపెట్టిన ఈ రెండు ఇన్సూరెన్స్ స్కీములను ప్రతి ఒక్కరు అమలు చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా ఈరోజే బ్యాంక్ కి వెళ్లి ఈ చిన్న పని మీరు చేస్తే మిమ్మల్ని నమ్ముకున్న మీ భార్య, పిల్లలకు రక్షణగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి. బ్యాంకులో అకౌంట్ లేని వారు ఎవరైనా ఉంటే వారు జీరో అకౌంట్ కూడా చేసుకొన వచ్చును. జీరో అకౌంట్ ఉన్నవారు కూడా ఈ ఇన్సూరెన్స్ స్కీములలో చేరవచ్చును.

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు,
మొబైల్ నెంబర్ 7386128877

LEAVE A RESPONSE