Home » త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టండి

త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టండి

* జీహెచ్ఎంసీ, ట్రాన్స్‌కో, పోలీసు అధికారులకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం
* లోత‌ట్టు కాల‌నీలు, ట్రాఫిక్‌, విద్యుత్ స‌మ‌స్య‌పై స‌మీక్ష‌
* స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వాములు కావాల‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపు

హైద‌రాబాద్‌: భారీ వ‌ర్షం, ఈదురుగాలుల‌తో రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌వ‌డం, ట్రాఫిక్ స‌మ‌స్య‌లు, విద్యుత్ అంత‌రాయాల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్షించారు. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అక్క‌డి నుంచే జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ రోనాల్డ్ రోస్‌, సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ కె.శ్రీ‌నివాస రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ఎస్‌.ఏ.ఎం రిజ్వి, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించారు.

భారీ వ‌ర్షాలు, ఈదురుగాలుల‌తో ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింద‌ని అధికారులు ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ముఖ్య‌మంత్రి వెంట‌నే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి విద్యుత్ స‌ర‌ఫ‌రాను పున‌రుద్ధ‌రించాల‌ని ఆదేశించారు. లోత‌ట్టు ప్రాంతాల్లో జ‌ల‌మ‌య‌మైన కాల‌నీల్లో ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన చేయూత‌ను అందించాల‌ని సూచించారు.

న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా క్లియ‌ర్ చేసి వాహ‌న‌దారులు త్వ‌ర‌గా ఇళ్ల‌కు చేరుకునేలా చూడాల‌ని పోలీసు అధికారుల‌ను ఆదేశించారు. వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది చేప‌ట్టే స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగ‌స్వాములు కావాల‌ని, స‌మ‌స్య తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటే ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు.త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టండి.

Leave a Reply