Suryaa.co.in

Telangana

ఘనంగా తలసాని జన్మదిన వేడుకలు

రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు బుధవారం PV మార్గ్ లోని జలవిహార్ లో ఘనంగా జరిగాయి. GHMC పరిధిలోని సనత్ నగర్ నియోజకవర్గంతో పాటు గోషామహల్, నాంపల్లి, అంబర్ పేట, ముషీరాబాద్, మలక్ పేట తదితర నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన Trs పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భారీ కేక్ ను కట్ చేశారు.


ఈ సందర్భంగా గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బందూక్ లక్ష్మణ్ దర్శకత్వంలో రూపొందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బయోపిక్ ప్రదర్శనను జల విహార్ MD రామరాజు ప్రారంభించారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయ పండితులు, బన్సీలాల్ పేట లోని ఫిలిమినా చర్చి పాదర్, బన్సీలాల్ పేట మసీదు కు చెందిన ఖాసీం హాజీ, అమీర్ పేట గురు ద్వారా గురువులు సర్వమత ప్రార్ధనలు నిర్వహించి మంత్రికి ఆశీస్సులు అందజేశారు. ముందుగా జలవిహార్ ఆవరణలో మంత్రి జమ్మి మొక్కను నాటారు.

అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు MLA లు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సుభాష్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, BC కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, బోయిన్ పల్లి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్, పలు శాఖలకు చెందిన అధికారులు, ఆలిండియా ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ C. కళ్యాణ్, సంతోషం ఫిల్మ్ మ్యాగజైన్ MD కొండేటి సురేష్, పలువురు కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, నాయకులు, కార్యకర్తలు పూల బొకేలను అందజేసి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రికి ప్రముఖుల శుభాకాంక్షలు
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ఫోన్ ల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. mLC కల్వకుంట్ల కవిత, ప్రముఖ సినీనటులు చిరంజీవి, మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ తదితర ప్రముఖులు మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A RESPONSE