Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ పనిచేసే తీరు ఇదేనా?

– మిస్టర్ డిజిపి….ఐపిఎస్ శిక్షణలో మీరు ఏం నేర్చుకున్నారు?
– అసాంఘిక శక్తులకు వత్తాసు పలకాలని ఏ పోలీసు మాన్యువల్ లో రాసి ఉంది?
– మాదక ద్రవ్యాల మాఫియాను ప్రశ్నించడానికి టిడిపి బృందం వెళ్తే దాడులకు తెగబడతారా?
– తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆగ్రహం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విలేకరుల సమావేశం వివరాలు ఆయన మాటల్లోనే..ఏమిటీ అరాచకం..ఏమిటీ అన్యాయం…అప్రజాస్వామికం? రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనితీరు అర్థవంతంగా ఉందా? అసలు పోలీసుల పనితీరుకు అర్థముందా? ఇదేనా వారికి శిక్షణలో నేర్పింది? కాకినాడలో ఏం జరుగుతోంది.. మాదకద్రవ్యాల మాఫియా ఆగడాలను ప్రశ్నించడానికి టీడీపీ బృందం కాకినాడకు వెళ్లకూడదా? మిమ్మల్ని ప్రశ్నించకూడదా? గతనెల 15వతేదీన గుజరాత్ లోని ముంద్రాపోర్టులో 21వేల విలువైన హెరాయిన్ సీజ్ చేశారు. అది విజయవాడలోని అషీ కంపెనీకి చేరాల్సిఉంది. 16వ తేదీన కాకినాడలోని జగన్నాథపురంరేవులో ఒకబోటు తగలబడింది.
దానిపై పోలీసులు దర్యాప్తుచేశారా? మామూలుగా బోట్ తగలబడితే పొగ నల్లగా రావాలి.. కానీ తెల్లటిపొగ ఎందు కొచ్చింది? తగలబడిన బోట్ లో తెల్లటి పౌడర్ ఉందని పోలీ సులు ఎందుకు గుర్తించలేకపోయారు? అక్కడ తగలబడిన బోట్ ను చూడటానికి వెళ్లిన టీడీపీబృందంపై మాదకద్రవ్యాల మాఫియా దాడిచేస్తుందా? దాడికియత్నించిన వారినిపోలీసులు ఆపరా? పోలీసులు చోద్యంచూస్తారా? ఇదేమీ పోలీసింగ్ డీజీపీ గారు? బోట్ తగలబడినాకూడా దానిలో ఏవైనా మిగిలిపోయిన వస్తువులుంటే వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతారు. అదికూడాపోలీసులు చేయలేదేం?
బోట్ నుచూసి తిరిగి టీడీపీ కార్యాలయానికి వచ్చిన నేతలపైకూడా ద్వారంపూడి అనుచరులు దాడిచేస్తారా? డీజీపీగారు, రాష్ట్రంలోఉన్నామా..లేక తాలిబన్ల ఆప్ఘానిస్తాన్ లోఉన్నామా? తాలిబన్లతో అధికారపార్టీవారికి సంబంధాలు ఉండొచ్చు, మాకుకాదు, మేము శాంతికాముకులం. అసాంఘిక శక్తులం మేంకాదే, మేమేమీ మాదకద్రవ్యాలు అమ్ముకునే జాతి కాదు, మాదకద్రవ్యాలతో తెలుగుయువతను నిర్వీర్యంచేసేవాళ్లం కాదు. మాదక ద్రవ్యాల వ్యాపారంతో మేం జాతిని నిర్వీర్యంచేసే పనులు చేయలేదే? తప్పుని తప్పు అనిచెబితే దాడిచేస్తారా? ప్రతిపక్షపార్టీలవారు ఎక్కడికీ వెళ్లకూడదా? మీరుచెప్పేది విని నోరుమూసుకొని కూర్చో వాలా?
ద్వారంపూడి అనేవ్యక్తి ఐవరీకోస్ట్ కుఎందుకెళ్లాడనే దానిపై విచారించని పోలీస్ వ్యవస్థ కూడా వ్యవస్థేనా? అసలు ఇది ఒక రాష్ట్రమేనా? ఎటుపోతోంది మనరాష్ట్రం? జరుగుతున్నదారుణాలపై ఎవరికి చెప్పుకోవాలి? గౌరవనీయులైన ప్రధాని మోదీజీకి హెరాయిన్ తో ఆంధ్రాకు ఉన్న లింకులు ఈపాటికే సమాచారం ఉండి ఉంటుంది, కేంద్రహోం మంత్రి అమిత్ షాకు కూడా తెలుసు. ముంద్రాపోర్టు నుంచి హెరా యిన్ విజయవాడకు దిగుమతి అయింది.
కానీ ఇక్కడి పోలీసు లు దానిపైదర్యాప్తు జరపరు. జగన్మోహన్ రెడ్డి చెప్పినదానికి జీ.. హూజూర్ అనే దుస్థితిలో ఇక్కడి పోలీస్ వ్యవస్థఉంది కాబట్టి, లక్షలాది తెలుగుబిడ్డలు నిర్వీర్యమవకముందే, మోదీజీ దీనిపై చర్యలు తీసుకోవాలి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి దుష్ట వ్యక్తుల ఆలోచనలకు జాతియువత మొత్తం బలైపోతుందనే ఆం దోళన దేశమంతా ఉంది. రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ మాదక ద్రవ్యాలు లభిస్తున్నాయి. మత్తుతో తయారుచేసిన సిగరెట్లను కూడా అమ్ముతున్నారు. రాష్ట్రప్రజలు భస్మాసుర ముఖ్య మంత్రి తెచ్చుకున్నారనడంలోఎలాంటి సంకోచం లేదు.నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్స్ తో (ఎన్ఐఎ) ప్రధానిమోదీ దర్యాప్తు జరిపించాలి. అప్పుడే వాస్తవాలు బయటకువస్తాయి. మారాష్ట్ర యువత నాశనంకాకుండా మోదీజీ వెంటనే స్పందించాలి. డ్రగ్స్ మాఫియా వెనకఎంతటి వారున్నాసరే మోదీజీ వెంటనే వారిపైచర్యలు తీసుకొని వారిని కస్టడీకి పంపాలి.
అషీ ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకుడు సుధాకర్, అషీ అనేపేరు ముస్లిం అమ్మాయిది. ఆ అమ్మాయి అలీషా కూతురు, అలీషాకు చంద్రశేఖర్ రెడ్డికి సన్నిహితసంబంధాలున్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిన అవసరం డీజీపీగారికి లేదా? ఒక్కసారి డీజీపీ తనభుజస్కంధాలపై ఉన్న ఐపీఎస్ అక్షరాలను, ఖడ్గాలను చూడాలి. కాకినాడలో టీడీపీవారిపై దాడి చేయడానికి వచ్చినవారిని పోలీసులు ముందుగా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ద్వారంపూడి మనుషులైతే దాడిచేయనిస్తారా? ఇదె క్కడి న్యాయం? పోలీసు మాన్యువల్ లో ఏం రాసుందో మీకు తెలియదా?
ప్రజాస్వామ్యవాదులంతా కూడా రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఆలోచించాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ నేతలు పట్టాభిరామ్,ఇతర నేతలపై దాడి చేయడానికి వచ్చిన వారికి పోలీసులే వత్తాసు పలకడం, మాఫియాకు అనుగుణంగా వ్యవహ రించడాన్ని తాము తీవ్రంగాఖండిస్తున్నాం. ముందస్తు అరెస్ట్ లు అనేవి ప్రతిపక్షాలకే పరిమితమా? తగలబడిన బోట్ లో ఉన్నది కచ్చితంగా హెరాయినే. అందుకు దాన్ని తగలబెట్టారు. గుజరాత్ లోని ముంద్రా పోర్టు నుంచి విజయవాడలోని అషీ కంపెనీకి, అక్కడి నుంచి చేరాల్సిన చోటుకి చేరింది. ప్రధానమంత్రి తమ విజ్ఞప్తిని మన్నించాలనికోరుతున్నాం.
టీడీపీనేతలకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రే బాధ్యుడవుతాడు. తరువాత జరగబోయే విపత్కర పరిస్థితులకు ఆయనే జవాబుదారు. కాకినాడ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.అవసరమైతే జరిగిన ఘటనపై, రాష్ట్రంలో సాగుతున్న మాదకద్రవ్యాల దందాపై కేంద్రానికి ఫిర్యాదుచేస్తాం. జాతి మొత్తాన్ని వీరి ధనదాహం కోసం నిర్యీర్యంచేస్తారా? లక్షలకోట్లు సంపాదించుకునేందుకు యువతను జీవచ్ఛవాల్లా మారుస్తారా? ముఖ్యమంత్రికి ఉన్న డబ్బుచాలదా? చివరకు ఏమీ తీసుకెళ్లకుండానే పైకి పోతామని ఆయన గ్రహిస్తే మంచిది. యువత నిర్వీర్యమయ్యే కార్యక్రమానికి కారకులు కావద్దని ముఖ్యమంత్రికి సూచిస్తున్నాం.

LEAVE A RESPONSE