Suryaa.co.in

Political News

అగ్రవర్ణ ప్రజలు హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి?

కేంద్రం కల్పించిన ఈ డబ్ల్యూ ఎస్ 10% రిజర్వేషన్లు.. టీఆర్ఎస్ ప్రభుత్వం మూడు సంవత్సరాలు కాలయాపన చేసినందుకు, లక్షల మంది రిజర్వేషన్ పొందలేక చదువు కోల్పోయినందుకా.. టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసేది?రెడ్డి- వైశ్య – బ్రాహ్మణ అగ్రవర్ణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి.
మన పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల కుంపట్లో ఉద్యోగాలు దొరకకా, పరాయి దేశానికి పొట్ట చేత పట్టుకొని పయనం అవుతున్నారు తల్లిదండ్రులు భార్య పిల్లలను వదిలి, కళ్ళముందు ఉండవలసిన పిల్లలు అన్నమో రామచంద్రా అని, కానరాని దేశంలో బ్రతకడానికి అప్పులు చేసి ప్రయాణం అవుతున్నారు. ఇలాంటివి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనబడడం లేదా?
ఈ లోపం ఎక్కడ జరుగుతుంది? మన అగ్రవర్ణ ప్రజలు ఐక్యత లేకనే విభజించి పాలిస్తుండు కెసిఆర్. మన అగ్రవర్ణ ప్రజలను మనుషులుగా గుర్తించని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వెయ్యాలి దేనికోసం ఓటు వేయాలి ? మన అగ్రవర్ణాల లో కూటికి గతి లేక, నానా ఇబ్బందులు పడుతూ చేయరాని పనులు చేస్తూ మనసు చంపుకొని జీవనము సాగిస్తున్నారు.
ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అగ్రవర్ణాలు అంటే చిన్న చూపు. కెసిఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికలు రాంగానే దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. మరి మనకెందుకు ఇవ్వడు? అగ్రవర్ణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. అలాంటి పథకం మన అగ్రవర్ణ పేదలకు ఎందుకు పెట్టకూడదు? పది లక్షల రూపాయలు ఇస్తే, మన పిల్లలు పరాయి దేశానికి ఎందుకు వెళ్తారు? ఏదో ఒక పని చేసుకొని ఇక్కడే బతుకుతారు కదా?
హుజురాబాద్ నియోజకవర్గంలో రెడ్డి -బ్రాహ్మణ- వైశ్య కులాలకు చెందిన వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకూడదు. మనను మనుషులుగా గుర్తించని ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలి.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695

LEAVE A RESPONSE