Suryaa.co.in

Political News

మోదీ వ్యతిరేక ప్రచారం మాయలో పడకండి

లక్షల మంది చనిపోయినా, లక్షలమంది లక్ష్యం మాత్రం బతికేవుండాలి అన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ యొక్క సైన్యాధిపతి శ్రీ భాజీ ప్రభు మాటలను స్మరిస్తూ, ఒక అయిదు విషయాలు.
మోదీ ప్రధాని అయినప్పటి నుండి, సుమారుగా కాకముందడి నుండే విదేశీ సొమ్ములకు ఆశపడే మీడియా, ప్రతిపక్షాలు కొన్ని విదేశీ శక్తులు .. మోదీ వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. ఈ మూడు గ్రూపులు కొంతకాలానికి ఆ విషయాలు వదిలేసి, మళ్ళీ కొత్త విషయాలపై విషప్రచారం మొదలు పెడతారు. ఫేక్ వీడియోలు, ఫోటోల ప్రచారం కూడా చేసినా ఈ ప్రచారాలను దేశ ప్రజలు ఎవరూ లక్ష్యపెట్టలేదు.
ఈమధ్య కొందరు హిందుత్వవాదులు కూడా ఆ ప్రచారానికి కొంతవరకు గందరగోళానికి గురవుతున్న సందర్భంగా ఈ పోస్టు రాస్తున్న.
మొట్టమొదట మనం గుర్తుంచుకోవలసిన విషయం. మోదీ సంఘ పూర్తిసమయ కార్యకర్త, దేశానికి ప్రధానిగా అంతకంటే అంకితభావం గల వ్యక్తిని ఉహించుకోలేము.
రెండవ విషయం…ఇప్పుడు ఉన్న కేంద్రప్రభుత్వం భారత స్వాతంత్య్రం తరువాత ఏర్పాటైన మొట్టమొదటి స్వదేశీ భావజాలంతో, ఎటువంటి విదేశి శక్తులు వెనకఉండి నడిపించని, పూర్తి మెజారిటీ ప్రభుత్వం. ఇది కొన్ని కోట్లమంది కొన్ని దశాబ్దాలుగా కలలుకంటే, ఎందరో ధనమనఃప్రాణ త్యాగలతో ఏర్పాటైన ప్రభుత్వం.
మూడవది..మోదీకి, వారి విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే వ్యక్తులు, మీడియా ఎవరు కూడా మోదీకి ఓటు వేయలేదు. ఆయన ప్రధాని కావాలి అని వారు అనుకోలేదు. వారు కొన్ని దశాబ్దాలుగా, వారసత్వంగా దేశసంపదను దోచుకుంటున్న వారు, లేదా విదేశీ తొత్తులు. ఆ విధంగా దేశసంపదను అక్రమంగా అనుభవించడం అలవాటు అయినవారు.. మోదీ ప్రధాని అయినప్పటి నుండి కేంద్ర ప్రభుత్వ తీవ్రవాద వ్యతిరేక విధానాలతో మొదలుకొని నోట్లరద్దు, జిఎస్టీ, ఆర్టికల్ 370, స్వచ్ఛభారత్, నూతన వ్యవసాయ చట్టం వంటి ప్రతి విధానములో ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కేంద్రప్రభుత్వాన్ని అపవాదుపాలు చేయడం కోసం, దేశ ప్రతిష్టను మంటగలపడనికి కూడా వెనుకాడరు. ఏ ఒక్క విధానంపైన కూడా, ఆ వ్యతిరేక వర్గంవారు చివరివరకు పోరాడిన దాఖలా ఒక్కటి కూడా లేదు.
నాలుగవది..దేశం అవినీతిరహితంగా, ఆర్థిక, సామాజిక, మౌళికవసతుల అభివృద్ధిలో ముందుకు పోతున్న సమయంలో.. కరోనా మనదేశంలోనే కాకుండా, దాదాపు అన్నిదేశాలలో చాలా రంగాలను దెబ్బతీసింది. ఏ దేశంలో కూడా దీనిని ప్రభుత్వ వైఫల్యంగా ఎవరు చూడలేదు, ప్రచారం చేసుకోలేదు. ఒక్క మన దేశంలోని ఆ స్వార్థపర వ్యక్తులు, మీడియా తప్ప. చాలా దేశాలకు సాధ్యంకాని టీకాను మన దేశ శాస్త్రవేత్తలు తయారు చేసినా, ఆ టీకా ను కూడా వ్యతిరేకించే స్థాయికి వీరి పైత్యం చేరుకుంది. ఫేక్ ఫోటోలు, వీడియోలతో భయానక వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కరోనా తొందరలోనే కనుమరుగు అవుతుంది. తరువాత ఆ స్వార్థపర వ్యక్తులు, మీడియాకు మరో విషయం దొరుకుతుంది.
అయిదవది…ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, ప్రధానమంత్రి కార్యాలయం అవినీతిరహితులతో సమర్ధవంతంగా పనిచేస్తుంది. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంచండి. దశాబ్ధాలుగా దేశసంపదను అక్రమంగా అనుభవిస్తున్న వ్యక్తులు – మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం మాయలో పడకండి. వారు సృష్టించే ఫేక్ ప్రచారం గురించి దేశప్రజలను వాస్తవాలవైపు మళ్లించండి. మనదేశంలో దేశభక్తి గల జాతీయవాద ప్రభుత్వం అధికారంలో ఉండడం నచ్చని స్వార్థపర వ్యక్తులు, మీడియా వ్యతిరేక ప్రచారం చేస్తూనే ఉంటారు. మనం మాత్రం సాధ్యమైనంత వరకు వీరి దేశ వ్యతిరేకం, ప్రభుత్వ వ్యతిరేకం అయిన ఫేక్ ప్రచారాన్ని దేశప్రజలకు వివరిస్తూ, ఈ కరోనా కష్టకాలంలో దేశప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేద్దాం.
చివరగా మరోసారి గుర్తుచేస్తున్న.. ఇది కొన్ని కోట్లమంది కొన్ని దశాబ్దాలుగా కలలుకంటే, ఎందరో ధన, మనప్రాణ త్యాగలతో ఏర్పాటైన ప్రభుత్వం.దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. మన దేశం….. మన బాధ్యత…..వందేమాతరం|

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695

LEAVE A RESPONSE