Home » హింసకు, దౌర్జన్యాలే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన

హింసకు, దౌర్జన్యాలే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన

స్వేచ్ఛను హరిస్తూ స్వచ్ఛ సంకల్పం నిర్వహణ హాస్యాస్పదం
ప్రజలపై చెత్త పన్ను వేస్తూ చెత్త పాలనకు శ్రీకారం చుట్టారు
– పోలిట్ బ్యూరో మెంబరు యనమల రామకృష్ణుడు
‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ పేరుతో ఫుల్ పేజి యాడ్స్ ఇచ్చి.. తాము గాంధీజీ వారసులం అనేలా రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. సత్యం, శాంతి, అహింసలు ఊపిరిగా జీవించిన గాంధీజీ ఫోటో పక్కన.. అడుగుకో అబద్దం ఆడుతూ కక్ష, హింసే ధ్యేయంగా పాలన సాగిస్తున్న జగన్ రెడ్డి బొమ్మ పెట్టడం జాతి పితను అవమానించడమే. గాంధీయిజాన్ని అవహేళన చేయడమే. స్వచ్ఛ సంకల్పం అంటూ హడావుడి చేసే ముందు.. జగన్ రెడ్డి తన మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి.
మనిషి కన్నా ముందు మనసు స్వచ్ఛంగా ఉండాలని భగవద్గీత, పశ్చాత్తాపం కన్నా గొప్పది లేదని జీసస్ క్రీస్తు బోధనలకు గాంధీ జీవితంలో పెద్దపీట వేస్తే.. జగన్ డిక్షనరీలో వీటికసలు తావే లేదు. అవినీతి, కుంభకోణాలు, అబద్దాలతో జీవించే జగన్ రెడ్డి స్వచ్ఛత గురించి మాట్లాడటం, స్వచ్ఛ సంకల్పం అంటూ హడావుడి చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
క్లీన్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వ పాలసీ. అందుకు తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే ఆ సొమ్ముతో వాహనాలు కొనుగోలు చేసి ప్రారంభోత్సవాల పేరుతో జగన్ రెడ్డి సొంత ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలపై చెత్త పన్ను వేస్తూ చెత్త పాలన అనిపించుకున్నారు. కమిషన్ల కోసమే చెత్తవాహనాలు కొనుగోలు తప్ప.. ప్రజా క్షేమం కోసం ఏమాత్రం కాదు.
గాంధీ అహింసను బోధిస్తే, జగన్ హింసా రాజ్యంగా ఏపిని మార్చాడు. వేల కోట్ల అవినీతితో, 11ఛార్జిషీట్లతో, 16నెలలు జైల్లో ఉన్న జగన్ రెడ్డికి.. గాంధీజీ పేరెత్తే నైతికత ఉందా..? నీతి-నిజాయితీతో గాంధీ జీవిస్తే.. అవినీతి చక్రవర్తిగా జగన్ అంతర్జాతీయ చరిత్ర సృష్టించాడు. దేశవిదేశాలలో విశ్వవిద్యాలయాలలో విద్యార్ధులకు జగన్ అవినీతి సిద్దాంతం క్విడ్ ప్రొ కో చర్చనీయాంశమైంది. గాంధీకి గార్లెండ్ వేసే నైతిక హక్కు జగన్ కు ఉందా..? ఆయనే ఆత్మవిమర్శ చేసుకోవాలి.
అహింసను గాంధీ బోధించాడు, ఆచరించాడు.. హింసారాజ్యంగా ఏపిని జగన్ మార్చాడు. దాడులు, దౌర్జన్యాలతో పేదల ధన మాన ప్రాణాలతో జె గ్యాంగ్ ఆడుకుంటోంది. గాంధీ బొమ్మ పక్కన జగన్ బొమ్మ పెట్టడం దుస్సాహసమే. సత్యం మాట్లాడాలని గాంధీ చెప్పారు, సత్యాగ్రహం చేశారు… కానీ జగన్ నోరు తెరిస్తే అన్నీ అసత్యాలే..అబద్దాల పితామహుడు జగన్ రెడ్డి. గ్రామ స్వరాజ్యం గాంధీజీ సిద్దాంతం… గ్రామీణ విధ్వంసం జగన్ విధానం. ప్రశాంతమైన గ్రామాలను కక్షలు-కార్పణ్యాలకు వేదికగా చేశారు.
స్వయంపాలన గాంధీజి ఆశయం… అరాచక పాలన జగన్ సిద్దాంతం. వైసిపి పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలే ప్రత్యక్షసాక్ష్యం. తప్పుడు కేసులతో బెదిరించి, నామినేషన్లు చింపేసి, దాడులు-దౌర్జన్యాలతో స్థానిక ఎన్నికల నిర్వహణలో జె-గ్యాంగ్ భయోత్పాతం చూసి దేశం యావత్తూ దిగ్భ్రాంతి చెందింది.
చెత్తను శుభ్రం చేయడం గాంధీ నేర్పాడు. చెత్తపై కూడా పన్నులతో చెత్తపాలన చేస్తున్నాడు జగన్. మద్యనిషేధం గాంధీ ఆశయం… కాన రాష్ట్రంలో నాసిరకం మద్యంతో వేలకోట్ల ముడుపులు ‘‘జె గ్యాంగ్’’ వసూళ్లు.. గంజాయి, హెరాయిన్ అక్రమ అమ్మకాలతో ఆంధ్రప్రదేశ్ ను మత్తుకు బానిస చేస్తున్నారు.. రాష్ట్ర ప్రగతిని జగన్ రెడ్డి నాశనం చేస్తున్నారు. గాంధీ జయంతికి ముందు రోజు.. మద్యం పాలసీ పేరుతో రాష్ట్రంలో మద్యం వ్యాపార విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఇకనైనా ఇటువంటి అరాచక పాలనకు స్వస్తిచెప్పి.. ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని కాక్షించాలి.

Leave a Reply