Suryaa.co.in

Features

మనం మరచిన మహానేత ..లాల్ బహదూర్ శాస్త్రి

అక్టోబర్ 2 అంటే మహాత్మ గాంధీ గారి పుట్టినరోజుగా మాత్రమే అందరూ గుర్తు పెట్టుకుంటారు. కానీ అదే రోజు భరతమాత కన్న మరో మహా నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు. ముస్లిమ్స్ మద్దతుదారు గాంధీ కంటే, ఎన్నో రకాల దేశానికి మేలు చేసిన LB శాస్త్రి ని ఇందిరా గాంధీ తాష్కెంట్ లో Russian KGB చేత చంపించింది..నెహ్రు ఫామిలీ ఆయన్ను అణగతొక్కారు.
ఏది ఏమైనా, మనం మరుపురాని రోజుగా గాంధీ జయంతిని పండుగగా జరుపుకునే అక్టోబర్ 2న మన దేశానికి మూడవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కూడా. నెహ్రూ మరణం తర్వాత గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి , భారత మూడో ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టారు.దేశం కోసం ప్రాణాలు విడిచిన లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2 ఉత్తర ప్రదేశ్‌లోని మొగల్ సరాయ్ గ్రామంలో శారదా ప్రసాద్ రాయ్, రామ్ దులారీ దేవీలకు జన్మించారు.
కాకిలా కలకాలం జీవించే కంటే హంసలా కొద్ది కాలం జీవించారు శాస్త్రిగారు. ప్రధానిగా కొంతకాలమే ఉన్న భారతీయ యవనికపై లాల్ బహుదూర్ శాస్త్రి తనదైన ముద్ర వేశారు. అదే ఆయన్ని ధృడమైన నాయకునిగా మన ముందు నిలబెట్టాయి. 1965 భారత్-పాకిస్థాన్ యుద్ధం సందర్భంగా, ఆయన ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలు, సంకల్పం, దీక్షా దక్షతలను ఎంత చెప్పుకున్నా తక్కువే.
ముఖ్యంగా దేశానికి వెన్నెముక లైన రైతులను, సైనికులను ఉద్దేశించి ఆయన చేసిన నినాదం ‘జై జవాన్..జై కిసాన్’ దేశాన్ని ఒక్కటి చేసింది. పాకిస్థాన్‌పై విజయాన్ని సాధించిన ఆనందాన్ని దేశ ప్రజలతో పంచుకునే లోపే 1966 జనవరి 10న పాకిస్థాన్‌తో తాష్కెంట్‌(ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్)లో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ మర్నాడే జనవరి 11న ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.
ఓ దేశాధినేత అదీ మరో దేశానికి అతిథిగా ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు వెళ్లి అక్కడే అసహజ, అనుమానాస్పద రీతిలో మృతి చెందటం, చరిత్రలో అంతకు ముందెన్నడూ లేదు. ఆ తర్వాత ఎప్పుడూ లేదు. ఐనా ఇంత వరకు శాస్త్రి మరణంపై పూర్తి స్థాయి సమగ్ర దర్యాప్తు జరగలేదు. జరిగినా వాటి ఫలితాలు వెల్లడికాలేదు. ఆఖరకు వాటికి సంబంధించిన పత్రాలు ఇప్పుడు అందుబాటులో లేవు.
మొత్తానికి భారతదేశ రాజకీయాల్లో ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా నీతి, నిజాయితీ, నిరాడంబరత, వ్యక్తిత్వం, త్యాగశీలతే శాస్త్రికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఆయన చనిపోయిన తర్వాత భారత ప్రభుత్వం ఆయన్ని భారతరత్నతో గౌరవించాయి. చనిపోయిన తర్వాత ఈ బిరుదు అందుకున్న తొట్ట తొలి నాయకుడిగా లాల్ బహదూర్ శాస్త్రి చరిత్రలో నిలిచిపోయారు. మొత్తానికి భారతదేశ యవనికపై లాల్ బహుదూర్ శాస్త్రిది ప్రత్యేక సంతకం అనే చెప్పాలి.

LEAVE A RESPONSE