Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగాలు కల్పించాల్సి వస్తుందనే యువతను మత్తులో జోగేలా చేస్తున్నాడు

– ఏపీ మాదకద్రవ్యాలకు అడ్డాగా మారడంపై యువత ఆలోచించాలి
– రాష్ట్రభవిష్యత్తే తమ భవిష్యత్ అనే వాస్తవాన్ని యువశక్తి గ్రహించాలి
– సంపూర్ణ మద్యపాననిషేధాన్ని ఎప్పుడు అమలుచేస్తాడో మహిళలకు సమాధానంచెప్పాలి
– టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి గౌతు శిరీష
సంపూర్ణ మద్యపాననిషేధమన్న హామీతో మహిళల ఓట్లుపొంది అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తనమాట ఎప్పుడు నిల బెట్టుకుంటారో రాష్ట్రమహిళలకు ఈ గాంధీజయంతి నాడు ఆయనే సమాధానం చెప్పాలని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి గౌతుశిరీష డిమాండ్ చేశారు. గాంధీజయంతిని పురస్కరించుకొని మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆమె శనివారం విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రమహిళలకు మద్యపాన నిషేధంపై హామీఇచ్చి, దాన్ని విస్మ రించిన ఏపీ ప్రభుత్వం, ప్రజల బలనహీనతను సొమ్ముచేసుకుం టూ ప్రధానఆదాయవనరుగా మార్చుకుందన్నారు. తమఆరోగ్యా న్ని పాడుచేస్తూ, ప్రజలను బలితీసుకుంటూ, వారిజీవితాలను పెట్టుబడిగా పెట్టి, తమఖజానా నింపుకుంటున్న పాలకులను ప్రజలు నిలదీయాల్సిన సమయం వచ్చిందని శిరీష తెలిపారు. ముఖ్యంగా యువత రాష్ట్రప్రభుత్వ దుర్మార్గాలపై ఆలోచనచేయాల ని, అధికారంలోకి వస్తే 2.30లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసగిం చిన జగన్మోహన్ రెడ్డిని నిలదీయాల్సిన బాధ్యత ప్రధానంగా యువతీయువకులపైనే ఉందన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ గా మారిస్తే, ఈ ముఖ్యమంత్రి డ్రగ్సాంధ్ర ప్రదేశ్ గా మార్చాడనే వాస్తవాన్ని యువత గుర్తించాలన్నారు. యువత మేల్కొకనపోతే భవిష్యత్ తరాలకు ఈరాష్ట్రాన్ని అందించ లేమన్నారు. ఈ అవినీతిప్రభుత్వం రాష్ట్రానికి ఇప్పటికే రాజధాని లేకుండాచేసిందని, ఒకకంపెనీకానీ, పరిశ్రమకానీ తీసుకొచ్చింది లేదన్నారు. ఇలానే కొనసాగితే ప్రపంచపటం నుంచి ఆంధ్రప్రదేశ్ కనుమరుగయ్యే పరిస్థితి త్వరలోనే వస్తుందని శిరీష వాపోయారు.
రెండున్నరేళ్లలో రాష్ట్రప్రభుత్వం ఎక్కడైనా ఎలాంటి అభివృద్ధి చేసిందా అని యువతను ప్రశ్నించిన ఆమె, భావితరాలు తమ భవిష్యత్ గురించి నిజంగా ఆలోచిస్తే, ఏపీప్రభుత్వాన్ని నిలదీయా ల్సిన సమయం వచ్చిందన్నారు. ఉద్యోగాలు, ఉపాధికోసం ఇతర రాష్ట్రాలకు వెళితే, అక్కడ ఏపీయువత రెండోకేటగిరీ పౌరులుగా గుర్తించబడతారన్నారు. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక తానిచ్చిన వాటిలో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదనే వాస్తవాన్ని యువతగ్రహించాలన్నారు. రాష్ట్ర బడ్జెట్ కుసరిపడే మొత్తం విలువైన డ్రగ్స్ రాష్ట్రంలోపట్టుబడితే, పోలీస్ శాఖ వైసీపీప్రభుత్వమిచ్చిన స్క్రిప్ట్ చదువుతోందని శిరీష ఎద్దేవాచేశారు. ఈ ప్రభుత్వం సాగించే డ్రగ్స్ దందా, అవినీతితో యువత భవిష్యత్, రాష్ట్రభవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళనతోనే తాము పాలకు లను ప్రశ్నిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలను నెలకొల్పడంలో రాష్ట్రం, మిగతా రాష్ట్రాలతో పోటీపడితే, ఈ ముఖ్యమంత్రి హయాంలో నేరాలు, ఘోరాల్లో దేశంలోనే ముందంజలో నిలిచిందన్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు, ప్రశ్నించేవారిని అరెస్ట్ చేసి జైళ్లకు పంపడాలు, యువత నోరెత్తెకుండా వారిని మాదకద్రవ్యాలకు బానిసలను చేయడమే ఈప్రభుత్వలక్ష్యాలుగా మారాయన్నారు. రెండున్నరేళ్ల వైసీపీపాలనలో రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కకంపెనీఅయినా వచ్చిం దాఅని టీడీపీమహిళా నేత నిలదీశారు. ఏపీలో ఉన్నసంస్థలపై రాజకీయకక్షసాధింపులకు పాల్పడటం, అమర్ రాజా వంటి సంస్థలను తరిమేయడంతప్ప ప్రభుత్వం సాధించిందేమీలేదన్నారు.
ఈ ప్రభుత్వ పనితీరుచూస్తుంటే రాష్ట్రం మిగిలేలా కనిపించడంలేదన్నా రు. ప్రభుత్వఆధ్వర్యంలో సాగుతున్న డ్రగ్స్ దందాతో విద్యార్థులు, యువత తల్లిదండ్రులు భయపడిపోతున్నారని, వారిబిడ్డలను ఎలా కాపాడుకోవాలా అని ఆందోళనతో బతుకుతున్నారన్నారు. ప్రభుత్వం పిచ్చిపిచ్చి మద్యం అమ్ముతుండటమే గాక, యువతకు మత్తుపదార్థాలగాలం విసరడానికిసిద్ధమవ్వడం బాధా కరమన్నారు. మద్యపాననిషేధం అన్నహామీని ముఖ్యమంత్రి ఎప్పుడు అమలుచేస్తాడో తక్షణమే సమాధానంచెప్పాలని శిరీష డిమాండ్ చేశారు. ప్రజలంటే పాలకులకు భయంలేకుండా పోయిం దని, ఒక్కఛాన్స్ అంటూ అధికారంలోకివచ్చినవారు రాష్ట్రానికే ఛాన్స్ లేకుండా చేస్తున్నారన్నారు.
తనకు బిడ్డలున్నారన్న శిరీష వారిభవిష్యత్ కోసం రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే బాధ్యత తనపై ఎంతుందో, యువతపై కూడా అంతేఉందన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాల్సి వస్తుందనే ఈప్రభుత్వం వారిని మత్తులో జోగేలా చేస్తోందన్నారు. పోలీస్ శాఖ అధికారపార్టీని కాపాడటంపై చూపుతున్నశ్రద్ధను, యువతభవిష్యత్ పై ఎందుకు చూపడంలేదని శిరీష ప్రశ్నించారు. మద్యపాన నిషేధంపై ప్రభుత్వ వైఖరేమిటో గాంధీజయంతి నాడుప్రభుత్వం తేల్చిచెప్పాల్సిందేనన్నారు

LEAVE A RESPONSE