మహిళలకు జగన్ రెడ్డి సర్కార్ ఇచ్చేది గోరంత…దోచేది కొండంత

మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య కార్యాలయం నందు బుధవారం నాడు ఆంధ్ర రాష్ట్ర మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఖండిస్తూ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య కార్యాలయంలో ఒక ప్రకటనలో మాట్లాడుతూ..

డ్వాక్రా రుణమాఫీ, పసుపు కుంకుమ ద్వారా చంద్రన్న పాలనలో కోటిమంది మహిళలు ఒక్కొక్కరు సమానంగా రూ. 20 వేలు లబ్దిపొందారు. జగన్ రెడ్డి పాలనలో ఒక్కొక్క మహిళ పొందిన లబ్ది రూ. 15 వేలకు తగ్గిపోయింది. ఈ రకంగా 50 లక్షలమంది డ్వాక్రా మహిళలకు జగన్ రెడ్డి టోకరా వేశారు.

నేడు రాష్ట్రంలో కోటీ 14 లక్షలమంది డ్వాక్రా మహిళలుంటే 79 లక్షలకే కుదించారు. ఈ రకంగా 35 లక్షలమందికి మొండిచేయి చూపారు.భార్యాబిడ్డలు తినాల్సిన మందు బాబుల కష్టార్జితాన్ని మద్యం ద్వారా జగన్ రెడ్డి దోచుకుతింటున్నాడు. నాశిరకం మద్యం ద్వారా మహిళల మాంగల్యాలు మంటగలుపుతున్నాడు జగన్

పిన్నమ్మ తాళి తెంచిన నరహంతకుల్ని రక్షిస్తున్న జగన్ రెడ్డి మహిళా ద్రోహి కాదా? కొని తినే ప్రతి వస్తువు పై ధరలు పెంచి ఒక్కో కుటుంబంపై 57 నెలల పాలనలో రూ.3 లక్షల భారం మోపారు. జగన్ ఇచ్చేది గోరంత దోచేది కొండంత. సెంటు పట్టాల ఇళ్ల నిర్మాణం పేరుతో మహిళలను అప్పులపాలు చేశారు. టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు ఇవ్వలేదు.

Leave a Reply