జుట్టు లాగిన పోలీసులపై కవిత ఫైర్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో నిరసనకు దిగిన ఏబీవీపీ కార్యకర్తను పోలీసులు జుట్టు లాగి కింద పడేయడంపై కల్వకుంట్ల కవిత స్పందించారు. నిరసనకారులపై అసభ్య ప్రవర్తనను ఖండిస్తున్నానని తెలిపారు. దురహంకార ప్రవర్తనకు పోలీసులు క్షమాపణ చెప్పాలన్నారు. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply