Suryaa.co.in

Andhra Pradesh

విద్యుత్ ప్రమాదాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్

– మోటార్ల కు మీటర్లు పెట్టడం తెలిసిన ఈ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు కాపాడడం తెలీదా?

కడప జిల్లా, చాపాడు మండలం, చియ్యపాడులో సాగు మోటారుకు విద్యుత్ సరఫరా చేసే తీగలు తెగిపడి కాలికి తగలడంతో ముగ్గురు రైతులు మరణించారు. రాష్ట్రంలో మిగతా చోట్ల విద్యుత్ ప్రమాదాలలో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఒక్కరోజే 5 గురిని బలితీసుకోవడం అత్యంత విషాదకరం
వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో విద్యుత్ ప్రమాదాల కారణంగా 675 మంది చనిపోయారు. 143 మంది గాయపడ్డారు. 681 పశువులు చనిపోయాయి. ఇవి స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చెప్పిన లెక్కలు. దక్షిణాదిలో ఏపీలోనే విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఇది సిగ్గుచేటు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం తెలుసు. ఆ మీటర్ల పేరిట వేల కోట్ల స్కామ్ చేయడం తెలుసు. కరెంటు రేట్లు పదేపదే పెంచడం తెలుసు. కానీ ప్రజల ప్రాణాలు తీస్తున్న విద్యుత్ ప్రమాదాలను నివారించడం, అందుకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవడం తెలీదా ఈ ప్రభుత్వానికి?

LEAVE A RESPONSE