Suryaa.co.in

Andhra Pradesh

అధికారమదంతో, అహంకారంతో మాట్లాడకు సజ్జలా?

– జైల్ మాన్యువల్ ప్రకారం హై ప్రొఫైల్ వ్యక్తి, కేవలం రిమాండ్ పై జైల్లో ఉన్న చంద్రబాబుకి కనీస సౌకర్యాలు, వైద్యసేవలు అందించాలని తెలియని నువ్వు ప్రభుత్వ సలహాదారువా?
• చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిపై తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలి
• వైద్య సేవలు, కనీస సదుపాయాలు పొందడం చంద్రబాబు హక్కు
• దాన్ని కాదనే అధికారం సజ్జలకు, జైలు అధికారులకు లేదు
• చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆయన భార్య, కోడలికంటే తాడేపల్లి తబలా బృందానికి బాగా తెలుసా?
• జైల్లో ఉండి కుట్రలకు పాల్పడటం, రాజకీయాలు చేయడం సజ్జలకు జగన్ రెడ్డికే బాగా తెలుసు
• కోడికత్తితో భుజంపై గీయించుకొని, అమాయక దళిత యువకుడిని జైల్లో పెట్టిన నీతిమాలిన చరిత్ర ఎవరిదో మర్చి పోయావా సజ్జలా?
• సొంత బాబాయ్ ని గొడ్డలిపోట్లకు బలిచేసి, గుండెపోటని నమ్మించేంత నేర్పరితనం చంద్రబాబుకి లేదుగా
• సొంత తల్లీ, చెల్లిని అధికారం కోసం వాడుకొని రోడ్డున పడేసేంత చాకచక్యం జగన్ కు ఉన్నంత మా నాయకుడికి లేదు
• మీడియాతో ఒకలా.. కోర్టుల్లో ఇంకోలా.. జనంలో మరోలా మాట్లాడటం సజ్జల, జగన్ రెడ్డికి అవినీతితో అబ్బిన విద్య
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

క్షీణిస్తున్న చంద్రబాబు ఆరోగ్యంపై యావత్ తెలుగుజాతి తీవ్రంగా ఆందోళన చెందు తోందని, తమకు అండగా నిలిచే ప్రజానాయకుడు వీలైనంత త్వరగా జైలునుంచి విడుదల కావాలని కాంక్షిస్తూ దేవాలయాలు, మసీదులు, చర్చిలలో పూజలు, నమా జ్ లు, ప్రార్థనలు చేస్తున్నారని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యంపై వెకిలిగా మాట్లాడటాన్ని సభ్యసమాజం అసహ్యించుకుంటోందని, సజ్జల బయట కనిపిస్తే ప్రజలు ఆయన ముఖాన ఉమ్మడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

చంద్రబాబునాయుడి లాంటి నాయకుడు రాష్ట్రానికి, ప్రజలకు కావాలిగానీ, సొంత బాబాయ్ ను గొడ్డలిపోటుకి బలిచేసి, గుండెపోటుగా నమ్మించిన దుర్మార్గాలు కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరులతో జైలు లోపలి పరిణామాలపై ఎలా మాట్లాడాడు? జైళ్లశాఖ డీఐజీ కంటే ముందు మీడియాతో మాట్లాడిన సజ్జల, మాజీ ముఖ్యమంత్రి బరువు గురించి ఎలా చెప్పాడు? సజ్జల అహంకారంతో అధికారమదంతో కాకుండా, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి.

జైల్లోని విషయాలు తనకు, అక్కడి అధికారుల కంటే ముందే తెలియడం.. సజ్జల, జగన్ రెడ్డి వ్యవస్థలను ఏ స్థాయిలో తమకు అనుకూలంగా వాడుకుంటున్నారో చెప్పడానికి నిదర్శనం. రాజమహేంద్రవరం జైల్లో ఉన్న 239 ఖైదీల్లో చంద్రబాబు కూడా ఒకరని సజ్జల, జైళ్లశాఖ డీఐజీ చెప్పడం వారి కుసంస్కారా నికి నిదర్శనం. చంద్రబాబు కేవలం జ్యుడీషియల్ రిమాండ్ లో మాత్రమే ఉన్నారని ఆయన దోషి కాదని జైళ్లశాఖ డీఐజీకి తెలియదా?

జైలు చంద్రబాబుకి అత్తారిల్లు కాదు గానీ సజ్జలా… ఏ జైలైనా జగన్ రెడ్డికి మాత్రం అమ్మగారిల్లే. జైలు మాన్యువల్ నిబంధనలు.. చంద్రబాబు స్థాయి తెలియకుండా నోరు పారేసుకోకు సజ్జలా?
రిమాండ్ లో ఉండే వ్యక్తుల్ని సాధారణ ఖైదీల్లా ట్రీట్ చేయడానికి వీల్లేదని జైళ్ల శాఖ నిబంధనలు చెబుతున్నాయి. జైల్ మాన్యువల్ లోని నిబంధన 1037, 385, 386 నిబంధనల ప్రకారం తాత్కాలిక జ్యుడీషియల్ రిమాండ్ లో ఉండే వ్యక్తులకు జైలు అధి కారులు కొన్నిసదుపాయాలు కల్పించాలి. అలా ఉండేవారి ఆరోగ్యపరిస్థితి సరిగా లేకుం టే వారికి వైద్యసదుపాయాలు కూడా అందుబాటులో ఉంచాలి. జైల్ మాన్యువల్ మొత్తం ప్రభుత్వమే అమలుచేయాలి. ఈ విషయాలు తెలియకుండానే జైళ్లశాఖ డీఐజీ ఆ వృత్తిలోకి వచ్చాడా?

మాన్యువల్ తెలుసుకోకుండా సజ్జల నోటికొచ్చినట్టు, జైలు ఏమైనా చంద్రబాబు అత్తారిల్లా అని సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నాడు. జైలు చంద్రబాబుకి అత్తారిల్లుకాదు గానీ.. ఏ జైలైనా జగన్ రెడ్డికి మాత్రం అమ్మగారిల్లేననే వాస్తవాన్ని సజ్జల గ్రహించాలి. కుటుంసభ్యుల్ని కూడా పొట్టన పెట్టుకునే సంస్కృతి, తల్లిని..చెల్లిని అవసరానికి వాడుకొని వదిలేసే నైజం జగన్ రెడ్డికి, సజ్జలకు మాత్రమే సొంతం. సొంత బాబాయ్ ను జగన్ రెడ్డి చంపిస్తే, అతన్ని వెనుకేసుకొచ్చినప్పుడు సజ్జల ఎలాంటివాడో అర్థమైంది. కోడికత్తితో భుజంపై గీయించుకొని, చేయని నేరానికి అమాయకుడైన దళిత యువకుడిని జైల్లో పెట్టిన నీతిమాలిన చరిత్ర ఎవరిదో మర్చి పోయావా సజ్జలా?

జగన్ రెడ్డి అండతో చంద్రబాబుని ఇబ్బందిపెడుతున్న జైలు అధికారులు తగిన మూల్యం చెల్లించుకుంటారు
మోస్ట్ హై ప్రొఫైల్ ఉన్న వీవీఐపీ అయిన చంద్రబాబు నాయుడి హెల్త్ బులెటిన్ ఎవరు పడితే వారు విడుదల చేయడం ఏమిటి? జైలు సిబ్బందికి ఆ అధికారం ఎక్కడిది? తాడేపల్లిలో కూర్చొని మాట్లాడే సజ్జల లాంటి లఫూట్ లకు చంద్రబాబుస్థాయి తెలియ దు సరే… జైలు అధికారులకు కూడా తెలియదా? జగన్ రెడ్డి అండతో చంద్రబాబుని ఇబ్బందిపెట్టే జైలు అధికారులు కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. జైలు ని క్రీడామైదానంగా మార్చుకొని రాజభోగాలు అనుభవించిన జగన్ రెడ్డి.. ఏ తప్పూ చేయకుండానే జైల్లో ఉన్న చంద్రబాబు ఒక్కటేనని అనుకోవడం సజ్జల అహంకారానికి నిదర్శనం.

రాజమహేంద్రవరం జైలుపై ఎగిరిన డ్రోన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిందని అధికారులు, పోలీసులు దానిపై విచారణ జరపడం లేదా?
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంపై డ్రోన్ ఎగిరిన విషయాన్ని ఆషామాషీగా తీసుకుంటారా? డ్రోన్ ఘటనపై స్థానిక ఎస్పీకి ఫిర్యాదు చేశామని జైళ్లశాఖ డీఐజీ రవి కిరణ్ చెప్పడం దేనికి నిదర్శనం. డ్రోన్ ఎగరేసినవారు ఎవరో ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు కనిపెట్టలేకపోయింది? తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన డ్రోన్ అని దానిపై విచారణ జరపడం మానేశారా? కిలారు రాజేశ్ విదేశాలకు పారిపోయాడని సజ్జల నోటి కొచ్చినట్టు ఎలా వాగుతాడు? ప్రభుత్వన్యాయవాది హైకోర్టులో కిలారు రాజేశ్ గురించి ఏం చెప్పాడు? మీడియాతో ఒకలా.. కోర్టుల్లో మరోలా .. జనంలో ఇంకోలా మాట్లాడటం సజ్జలకు, ముఖ్యమంత్రికి అవినీతితో అబ్బిన విద్య.

చంద్రబాబుకి పంపే ఇంటిభోజనం నేరుగా ఆయనవద్దకు వెళ్లదు… జైలు అధికారులు మొత్తం పరిశీలించాకే భోజనం లోప లికి పంపిస్తారు. భోజనంపై కూడా బుద్ధిలేకుండా సజ్జల మాట్లాడుతున్నాడంటే ఏమ నాలి? చంద్రబాబుని జైల్లో బాగానే చూసుకుంటే ఆయన బరువు ఎందుకు తగ్గారో సజ్జల చెప్పాలి. బయటఉన్నప్పడు చంద్రబాబు రోజూ బరువు చెక్ చేసుకునేవారు. ఆయన జైలుకెళ్లే రోజు ఎంత బరువున్నారో జైలు రికార్డుల్లో ఉంటుంది. దాన్నికూడా మారిస్తేనే జైలు అధికారులు ఇప్పుడు చంద్రబాబు 66 కిలోలు ఉన్నారంటున్నాడు.

కానీ చంద్రబాబు వాస్తవంగా 72 కిలోల బరువుంటారు. లోఫర్..లఫూట్ ఐడియాలు సజ్జలకు, జగన్ రెడ్డికే వస్తాయి. టీడీపీ నేతలమైనా మాకు, మా నాయకుడికి అలాంటి ఆలోచనలు ఉంటే ఈ ప్రభుత్వమే ఉండేది కాదు. చంద్రబాబుని కలిసిన ఆయన భార్య, కోడలు ఆయన ఆరోగ్యం బాగోలేదంటుంటే, తాడేపల్లిలోని లఫూట్లు, తబలా బ్యాచ్ బాగున్నాడని ఎలా చెబుతారు? చంద్రబాబుని పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు ఆయన కు స్టెరాయిడ్స్ ఎలా రిఫర్ చేస్తారు? వారికి అలా చేయమని చెప్పింది ఎవరు?

ప్రభుత్వ కక్షసాధింపులు…జైలు అధికారుల తీరుతోనే చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదకరంగా మారింది చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిపై తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలి
ప్రభుత్వ కక్షసాధింపులకు తోడు .. జైలు అధికారులు చంద్రబాబుకి కనీస సౌకర్యాలు కూడా కల్పించనందునే ఆయన ఆరోగ్యం ప్రమాదకరంగా మారింది. 73ఏళ్లున్న వ్యక్తి, కేవలం నెలరోజుల్లోనే 5 కిలోల బరువుతగ్గడం చాలా ప్రమాదమని వైద్యనిపుణలు చెబుతున్నారు. చంద్రబాబు చుట్టూ అపరిశుభ్ర వాతావరణం కల్పించి, ప్రభుత్వమే కావాలని ఆయన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రభుత్వం తక్షణమే చంద్రబాబు వ్యక్తిగత వైద్యుల్ని జైల్లోకి అనుమతించి, వారితో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించాలి.

అలానే చంద్రబాబుని వెంటనే కేంద్రప్రభుత్వ వైద్యసంస్థకు తరలించి మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలి. వైద్యసేవలు పొందండం చంద్రబాబు హక్కని జైలు నిబంధనలే చెబుతున్నాయి. క్షీణించిన చంద్రబాబు ఆరోగ్యంపై వెంటనే రాష్ట్ర గవర్నర్ స్పందించాలి. మాకు, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఆరోగ్యంగా ఉండటం, క్షేమంగా బయటకు రావడమే ముఖ్యం. ఈ ప్రభుత్వం చంద్రబాబు విషయంలో ఎంత మూర్ఖంగా వ్వవ హరిస్తే, అంతగా నష్టపోతుంది. చంద్రబాబుకి చిన్న అపకారం జరిగినా జగన్ రెడ్డే బాధ్యుడు.” అని బొండా ఉమా స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE