• మూడేళ్లలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలతో ప్రజల నెత్తిన రూ.1,375 కోట్ల భారం
• రాష్ట్ర వ్యాప్తంగా బస్ స్టేషన్ల ఎదుట టీడీపీ నిరసనలు
• నియోజకవర్గ, మండల కేంద్రాల్లోని బస్ స్టేషన్ల వద్ద బస్సుల అడ్డగింత
• పలుచోట్ల బస్సుల్లో ప్రయాణించి పెంచిన చార్జీలను వివరించిన నేతలు
సామాన్యుడు బస్సు ఎక్కుదామనుకున్నా జగన్ రెడ్డి బాదుడు తప్పడం లేదని టీడీపీ మండిపడింది. ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. మూలిగే నక్క మీద తాటికాయపడినట్లు ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు, నిత్యవసర సరుకుల ధరల పెరుగుదల, చెత్త పన్నులతో నానా అవస్థలు పడుతున్న ప్రజలపై మళ్లీ బస్సు ఛార్జీలు పెంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించింది. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గం, మండల కేంద్రాల్లో టీడీపీ పెద్ద ఎత్తున గురువారం ఆందోళనకు దిగింది.
బస్ స్టేషన్ల వద్దకు చేరుకుని బస్సులను కదలకుండా అడ్డుకున్నారు. మరికొన్ని చోట్ల రహదారులపై బస్సులు కదలకుండా నిలువరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ…అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రెండు సార్లు ఆర్టీసీ పెంచిన దిక్కుమాలిన ప్రభుత్వం అని విమర్శించారు. మూడేళ్లలో పెంచిన మూడేళ్లలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలతో ప్రజల నెత్తిన రూ.1,375 కోట్ల భారం మోపారని ఆరోపించారు. ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ రెండు రోజుల పాటు ఆందోళనలకు పిలుపునిచ్చింది. శుక్రవారం కూడా ఈ నిరసనలు కొనసాగనున్నాయి. అయితే జిల్లాల వారిగా చేపట్టిన నిరసనల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో…
• టెక్కలిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆదేశాలతో నేతలు, కార్యకర్తలు ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ బస్టాండ్ల ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.
• నరసన్నపేటలో ఇంఛార్జ్ బగ్గు రమణమూర్తి ఆద్వర్యంలో ఆర్టీసీ ఛార్జీలను నిరసిస్తూ..మానవ హారం నిర్వహించారు.
• ఆముదాలవలసలో మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని బస్టాండ్ ఎదుట ఆందోళన చేశారు.
• పాతపట్నంలో కలమట వెంకట రమణ ఆద్వర్యంలో పాదయాత్రగా బస్టాండ్ కు వెళ్లి ఆర్టీసీ చార్జీలు తగ్గించాలంటూ నిరసన తెలిపారు.
• ఎచ్చెర్లలో ఇంఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు ఆదేశాలతో కిమిడి రామ్ మళ్లికనాయుడు ఆద్వర్యంలో నిరసనలు తెలిపారు.
విజయనగరం జిల్లాలో…
• గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పల నాయుడు మాట్లాడుతూ..విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మాట్లాడారు.
• శృంగవరపుకోట నియోజకవర్గంలో ఇంచార్జ్ కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి బస్సులో ప్రయాణించి, ప్రయాణికులను చార్జీల గురించి అడిగి తెలుసుకున్నారు.
• రాజాంలో మాజీ మంత్రి కొండ్రు మురళీ ఆద్వర్యంలో కార్యకర్తలతో పెద్ద ఎత్తున కలిసి బస్టాండ్ వద్ద ఆందోళన చేశారు.
• బొబ్బిలిలో ఇంచార్జ్ బేబినాయన ఆద్వర్యంలో బొబ్బిలి జంక్షన్ వద్ద ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
• నెలిమర్లలో ఇంఛార్జ్ పతివాడ నారాయణస్వామి ఆద్వర్యంలో బస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో…
• కురుపాంలో ఇంచార్జ్ తోయక జగదీశ్వరి ఆద్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ బస్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టారు.
• రంపచోడవరంలో ఇంఛార్జ్ వంతల రాజేశ్వరి ఆధ్వర్యంలో ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
విశాఖపట్నం జిల్లాలో…
• విశాఖపట్నంలో ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ..విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, విశాఖ సౌత్ ఇంఛార్జ్ గండి బాబ్జీ, భీమిలి ఇంఛార్జ్ కోరాడ రాజాబాబు, విశాఖ పార్లమంట్ ఎంపీ అభ్యర్థి భరత్ బాబు బస్టాండ్ ఎదుటు ఆందోళన నిర్వహించారు.
అనకాపల్లి జిల్లాలో…
• అనకాపల్లిలో ఇంఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
• చోడవరంలో ఇంచార్జ్ బత్తుల తాతయ్య బాబు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ బస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బుద్ధా నాగ జగదీశ్వరరావు పాల్గొన్నారు.
• మాడుగులలో ఇంచార్జ్ పీవీజీ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని ఆందోళన చేపట్టారు.
• యలమంచిలిలో ఇంఛార్జ్ ప్రగఢ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పెంచిన ఆర్టీసీ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో…
• పార్వతీపురంలో బొబ్బొలి చిరంజీవులు ఆద్వర్యంలో ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
తూర్పు గోదావరి జిల్లాలో…
• రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాణీ ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ పాల్గొన్నారు.
• అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పెరిగిన ఆర్టీసీ ఛార్జీలను నిరసిస్తూ బస్ స్టేషన్ వద్ద ప్రయాణికులకు వివరించారు. అనంతరం పువ్వులు పంచి వినూత్నంగా నిరసన తెలిపారు.
• రాజానగరం ఇంఛార్జ్ పెందుర్తి వెంకటేశ్ ఆధ్వర్యంలో కోరకొండలో ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా బస్టాండ్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
• కొవ్వూరులో ద్విసభ్య కమిటీ సభ్యుడు కంఠమనేని రామకృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి పెరిగిన ఆర్టీసీ ఛార్జీలపై నిరసన తెలిపారు.
• ఆర్టీసీ ఛార్జీల పెంపు వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గోపాలపురంలో నిరసన తెలిపారు.
కాకినాడ జిల్లాలో….
• ప్రత్తిపాడులో ఇంచార్జ్ వరపుల రాజా ఆద్వర్యంలో ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
• పిఠాపురంలో ఇంఛార్జ్ వర్మ ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ, బస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు.
• జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో నియోజవకర్గ వ్యాప్తంగా మండల నాయకులు ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని బస్ స్టేషన్ ఎదట నిరసనలు తెలిపారు.
• తునిలో ఇంఛార్జ్ యనమల కృష్ణుడు కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో…
• పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు స్థానిక బస్ స్టేషన్ వద్ద కార్యకర్తలతో కలిసి బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
• నర్సాపురంలో ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో బస్ స్టాండ్ కు ర్యాలీగా చేరుకుని ఆందోళన చేశారు.
• బీమవరంలో ఇంఛార్జ్ తోట సీతారామలక్ష్మీ ఆధ్వర్యంలో బస్ స్టాండ్ చేరుకుని ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని బస్సులను అడ్డగించారు.
• ఉండిలో ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
• తణుకులో ఇంఛార్జ్ అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని బస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.
• తాడేపల్లిగూడెంలో ఇంఛార్జ్ వలవల బాబ్జీ ఆద్వర్యంలో రోడ్డపై బైఠాయించి, ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఏలూరు జిల్లాలో…
• ఏలూరు పట్టణంలో ఇంఛార్జ్ బడేటి చంటి ఆద్వర్యంలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ, బస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు.
• ఉంగుటూరులో ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొని ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
• కైకలూరులో ఇంఛార్జ్ జయమంగళ వెంకటరమణ ఆద్వర్యంలో ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ, బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు.
• పోలవరంలో బొరగం శ్రీనివాస్ ఆద్వర్యంలో ఆందోళన చేపట్టారు. చింతలపూడిలో పార్టీ నేతలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నిరసన తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లాల్లో…
• జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని నిరసనలు తెలిపారు.
• విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు బస్సుల్లో ప్రయాణించి, ప్రయాణికులకు పెరిగిన విద్యుత్ ఛార్జీల గురించి వివరించారు.
• మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో రహదారిపై బస్సులను అడ్డగించి నిరసన తెలిపారు.
• జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఎన్టీఆర్ సర్కిలో లో నిరసన తెలిపారు.
• నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బస్సులో ప్రయాణం చేసి, ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
కృష్ణా జిల్లాలో…
• గన్నవరంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోలన చేపట్టారు.
• మచిలీపట్నంలో పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆద్వర్యంలో పెంచిన బస్సు చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.
• పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
• పామర్రులో ఇంఛార్జ్ వర్ల కుమార్ రాజా ఆద్వర్యంలో ఆర్టీసీ చార్జీలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లాలో…
• పత్తిపాడులో టీడీపీ నేత మాకినేని రత్తయ్య ఆధ్వర్యంలో ఆర్టీసీ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ బస్టాండ్ ఎదుట బైఠాయించి నిరసనలు తెలిపారు.
బాపట్ల జిల్లాలో….
• రేపల్లెలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆదేశాలతో నియోజకవర్గ వ్యాప్తంగాపెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బస్ స్టేషన్ల ఎదుట బైఠాయించారు.
• పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాలతో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు బస్ స్టేషన్ల ముందు బైఠాయించి పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
• చీరాలో ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ బస్టాండ్ ఎదుట పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు.
పల్నాడు జిల్లాలో…
• వినుకొండలో మాజీ ఎమ్మెల్యే జీవీ.ఆంజనేయులు బస్ స్టేషన్ ఎదుటు బైఠాయించి ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
• నరసరావుపేటలో ఇంఛార్జ్ చదలవాడ అరవిందబాబు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి,ప్రయాణికులతో ముచ్చటించారు.
• పెదకూరుపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ బస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్సులో ప్రయాణించారు.
• సత్తెనపల్లిలో నియోజకవర్గ పార్టీ నేతలు నిరసనలు తెలిపారు.
• చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో నేతలు, కార్యకర్తలు పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ, బస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.
*ప్రకాశం జిల్లాలో…
• దర్శిలో ఇంచార్జ్ పమిడి రమేష్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా ఆందోళన చేపట్టారు.
• కనిగిరిలో ఉగ్రనరసింహారెడ్డి ఆద్వర్యంలో ఆర్టీసీ చార్జీల పెంపుపై ఆందోళన చేశారు.
• ఎర్రగొండపాలెంలో ఇంఛార్జ్ ఎరిక్షన్ బాబు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టి బస్సులు కదలకుండా అడ్డుకున్నారు
• ఒంగోలు పట్టణంలో మాజీ ఎమ్మెల్య దామచర్ల జనార్థన్ ఆద్వర్యంలో బస్టాండ్ ఎదుట నిరసన తెలిపారు.
• మార్కాపురం, గిద్దలూరు ఇంఛార్జులు కందుల నారాయణరెడ్డి, ముత్తముల అశోక్ రెడ్డి పిలుపు మేరకు నాయకులు బస్టాండ్ వద్ద ఆందోళనలు చేపట్టారు.
• కొండేపిలో ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి ఆదేశాలతో నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లాలో…
• నెల్లూరు రూరల్, పట్టణ నియోజకవర్గాల్లో అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
• ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు.
• కావాలిలో మాకేపాటి సుబ్బానాయుడు, కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
• కోవూరులో ఇంచార్జ్ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆదేశాలతో నేతలు బస్ స్టేషన్ ఎదుట ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
హిందూపురం జిల్లాలో…
• మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కార్యకర్తలో కలిసి ఆర్టీసీ డిపోముందు బైఠాయించి, చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
• పెనుగొండలో బీకే.పార్థసారధి ఆదేశాలతో నేతలు ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
• హిందూపురం, రాప్తాడు, ధర్మవరం, కదిరిలో ఎమ్మెల్యే బాలకృష్ణ, పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, కందికుంట వెంకట ప్రసాద్ ఆదేశాలతో నేతలు కార్యకర్తలు ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లాలో…
• గుంతకల్లులో ఇంఛార్జ్ జితేంద్ర గౌడ్ బస్ స్టేషన్ వద్దకు చేరుకుని పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని నిరసన తెలిపారు.
• కళ్యాణదుర్గంలో మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.
• శింగనమలలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు.
తిరుపతి జిల్లాలో…
• తిరుపతి పట్టణంలో ఇంఛార్జ్ సుగుణమ్మ ఆధ్వర్యంలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహాయాదవ్ పాల్గొన్నారు.
• శ్రీకాళహస్తిలో ఇంఛార్జ్ సుధీర్ ఆదేశాలతో నేతలు, కార్యకర్తలు బస్ స్టేషన్ల ఎదుట ఆందోళన చేపట్టారు.
• సత్యవేడులో టీడీపీ నేత జేడీ రాజశేఖర్ ఆదేశాలతో నియోజకవర్గం వ్యాప్తంగా పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని నిరసనలు తెలిపారు.
• గూడూరులో ఇంఛార్జ్ పాశం సునీల్ కుమార్ ఆదేశాలతో నాయకులు ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని బస్ స్టేషన్ ఎదుట ఆందోళనలు చేపట్టారు.
అన్నమయ్య జిల్లాలో…
• రాజంపేటలో ఇంఛార్జ్ బత్యాల చెంగల్రాయుడు కార్యకర్తలతో కలిసి బస్ స్టేషన్ వద్దకు చేరుకుని పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
• మదనపల్లిలో ఇంఛార్జ్ దొమ్మాలపాటి రమణ ఆద్వర్యంలో బస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు.
• తంబళ్లపల్లిలో శంకర్ యాదవ్ ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు.
• పీలేరు, పుంగనూరులో ఇంఛార్జులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాలతో నాయకులు, కార్యకర్తలు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
కర్నూలు జిల్లాలో…
• కర్నూలు పట్టణంలో పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
• ఆదోనిలో మీనాక్సి నాయుడు ఆధ్వర్యంలో 500 బైకులతో ర్యాలీ చేసి, ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
• కోడుమూరులో ఇంఛార్జ్ ఆకేపోగు ప్రభాకర్, పత్తికొండలో ఇంఛార్జ్ కె.ఇ.శ్యాంబాబు ఆధ్వర్యంలో బస్ స్టేషన్ల వద్ద పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
నంద్యాల జిల్లాలో…
• నందికొట్కూరులో నంద్యాల పార్లమెంట్ అద్యక్షులు గౌరు వెంకటరెడ్డి ఆద్వర్యంలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బస్టాండ్ ఎదుటు నిరసన తెలిపారు.
• పాణ్యంలో మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆద్వర్యంలో స్థానిక బస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు.
• నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి నిరసనలో పాల్గొని పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
• బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే బీ.సీ.జనార్థన్ రెడ్డి ఆద్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు.
• డోన్ లో మన్నె సుబ్బారెడ్డి ఆద్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బస్ స్టేషన్ ఎదుట నిరసనలు తెలిపారు.