ఎస్టీ కమీషన్‌ను ముట్టడించిన తెదేపా గిరిజన నేతలు

-జగన్ రెడ్డి తోత్తుగా మారిపోయిన కమిషన్ సభ్యులను భర్తరప్ చేయాలి
-ఎస్టీలపై దాడులను ఖండించలేని ఎస్టీ కమిషన్ అవసరమా?
– రాష్ట్ర టిడిపి ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం. ధారు నాయక్

గిరిజనులకు అండగా నిలబడాల్సిన రాష్ట్ర ఎస్టీ కమీషన్ జగన్ రెడ్డి తొత్తుగా మారిపోయిందని…కమీషన్ సభ్యులు కమీషన్ల కోసమే పనిచేస్తున్నారని తెదేపా ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం. ధారు నాయక్ అన్నారు. బుధవారం విజయవాడ, బందర్ రోడ్డు, ఆర్ అండ్ బీ భవన్‌లోని కమీషన్ కార్యాలయాన్ని తెదేపా గిరిజన నేతలు ముట్టడించారు.

ఈ సంధర్బంగా ధారు నాయక్ మాట్లాడుతూ…గత నాలుగున్నరేళ్లుగా 1725 మందిపై దాడులు, 63 మంది గిరిజనులను హత్య చేస్తే కనీసం కమీషన్ స్పందించిన పాపాన పోలేదు. గిరిజనుల హక్కులను కాపాడలేని కమీషన్ అవసరమా? కమీషన్ జగన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తూ రాజ్యాంగ విధులను విస్మరించింది. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గిరిజనుల భయాందోళనలతో బ్రతుకుతున్నారు.

ఒంగోలులో మోటా నవీన్ అనే గిరిజన యువకుడిపై మూత్రం పోసి త్రాగమన్నారు. నకిరేకల్లు శివాపురం తండాకు చెందిన గిరిజన మహిళ మంత్రీబాయిని వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి అత్యంత అమానుషంగా ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేశాడు. మోపిదేవి మండలం, కే.కొత్తపాలెంలో వైసీపీ నాయకుడు అమాయకులైన యానాదులపై దాడి చేసి అక్రమ కేసులు బనాయించారు. కర్నూలులో భర్త కళ్లెదుటే గిరిజన ఆడబిడ్డపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. కానీ, కమీషన్ ఏనాడు స్పందించలేదు. గిరిజనులపై దాడులు, కమీషన్ తీరు చూస్తుంటే ప్రభుత్వమే దాడులను ప్రోత్సహిస్తోందనిపిస్తోంది.

రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి. పోలీసులే వైకాపా నేతల అరాచకాలకు అండగా నిలుస్తున్నారు. దీంతో నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. అసాంఘిక శక్తులు, అధికారపార్టీ రౌడీ మూకలు గిరిజనులపై దమన కాండ సాగిస్తున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి మొగిలి కల్లయ్య, తెదేపా ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు కత్తి పద్మ, కాళియ నాయక్, ఇండ్ల శ్రీనివాస్, కళావతి, సుబ్బయ్య, మనోహర్ నాయక్, మొగిలి శ్రీనివాస్, రెడ్డన్న, మల్లేశ్వర్ రావు, చెన్నకేశవులు, బి.వెంకటేశ్వర్లు, పార్లమెంటుపార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply