Suryaa.co.in

Andhra Pradesh

ఆడపిల్లల రక్షణలో సీఎం అలసత్వం వహిస్తే టీడీపీ ఊరుకోదు

– తెలుగు మ‌హిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగ‌ల‌పూడి అనిత
పోలీసులు, డీజీపీ, హోం మినిష్టర్, సీఎం ఆడపిల్లల రక్షణలో అలసత్వం వహిస్తే టీడీపీ ఊరుకోదని తెలుగు మ‌హిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగ‌ల‌పూడి అనిత పేర్కొన్నారు. గురువారం విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆమె మాటలు క్లుప్తంగా మీకోసం…పోలీసులు, డీజీపీ, హోం మినిష్టర్, సీఎం ఆడపిల్లల రక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆడపిల్లల రక్షణకై లోకేశ్ నడుం బిగించారు. పరామార్శకు వెళ్తున్న లోకేశ్‌ని అడ్డుకోవడానికి వచ్చిన వేలాది పోలీసులు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఏమయ్యారు?. జగన్ చేతకానితనంతో ఆడపిల్లకు అన్యాయం జరిగిన తరువాత పరామర్శకు వస్తున్న లోకేశ్ ను రానీయకుండా అడ్డుకోవడం అన్యాయం.
తెలుగుదేశం నాయకులను గృహనిర్భందం చేయడం సిగ్గుమాలిన చర్య. జగన్ రెడ్డి ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం, చేవ లేవు. జగన్ ది చేతకాని ప్రభుత్వమని ఒప్పుకోవాలి. వెయ్యి మంది పోలీసులతో పహారా కాయాల్సిన అవసరమేమొచ్చిందో చెప్పాలి. తాడేపల్లికి కూతవేటు దూరంలో సీతాపురం దగ్గర గ్యాంగ్ రేప్ జరిగితే జగన్ నోరు మెదపలేదు. ఆడపిల్లకు అన్యాయం గురించి నోరెత్తడు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాడు. ఆడపిల్లల రక్షణకై మేం ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటాం. గుంటూరులో యువతిపై గ్యాంగ్ రేప్ జరిగి. భార్య, భర్తలు అర్ధరాత్రి స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వబోతే తీసుకోలేదు. టీడీపీ నాయకులను అరెస్టు చేయడంలో ఉన్న శ్రద్ధ ఆడపిల్లలకు రక్షణ కల్పించకపోవడంలో లేదు.
గన్నవరం వద్ద నుంచి నరసరావుపేట వెళ్లే వరకు పోలీసు బలగాలను మొహరించారంటే లోకేశ్ అంటే భయమా? లేక ఆడపిల్లలను రక్షించడంలో చేతకానితనమో అర్థంకావడంలేదు. మీరు చెప్పినట్లుగానే 21 రోజుల్లో దిశ చట్టం ప్రకారం నిందితుడికి ఉరిశిక్ష విధించడంగానీ, లేదా శిక్ష పడాలని లోకేష్ ఇనుషియేషన్ కూడా తీసుకున్నారు అయినా అడ్డుకుంటున్నారు. రమ్య, అనూషలకు అన్యాయం జరిగి రోజులు గడస్తున్నా ఇంతవరకు న్యాయంజరగలేదు. వరలక్ష్మి, తేజశ్విని లు కూడా అన్యాయానికి గురయ్యారు. వారికీ న్యాయం జరగలేదు. ఆడపిల్లలను దారుణంగా, కర్కశంగా చంపేస్తున్నారు.
శిక్షలు పడితేగానీ నిందితుల్లో భయముండదు. ప్రభుత్వమంటే నిందితులకు భయంలేదు. కనీసం ప్రతిపక్షాన్ని చూసైనా భయం పుట్టాలి. డీజీపీ, పోలీసులు ఉద్యోగ ధర్మాన్ని సరిగ్గా పాటిస్తే ఆడవారు రక్షణలో ఉంటారు. సీఎం కుర్చీ కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ చేసిన ఓదార్పుయాత్ర కాదిది. ఆడపిల్లలకు రక్షణ కావాలని చేస్తున్న యాత్ర. ఆడపిల్లలకు రక్షణ కల్పంచలేమని చేతులెత్తేశారు. ఆడపిల్లల రక్షణే అల్టిమేట్ గా తీసుకొని రాబోయే కాలంలో మహిళలమీద అఘాయిత్యాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందని గ్రహించాలి. మా పోరాటాన్ని ఎంతవరకైనా తీసుకెళ్లడానికి మేం సిద్ధంగా ఉన్నాం.

LEAVE A RESPONSE